ప్రస్తుతం దేశంలో అంతా డిజిటల్ మయం అవుతుంది. ఏ పని కోసమైనా ఆధార్ కార్డు ను ఏ విధంగా ఉపయోగిస్తామో అదేవిధంగా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి పాన్ కార్డు కూడా అంతే ముఖ్యం. ఈ కార్డు లేకపోతే బ్యాంకు రంగానికి చెందిన పనుల్లో ఇన్కమ్ టాక్స్ కు సంబంధించిన ఏ పని కూడా జరగదు. ఇందులో ఏ పని జరగాలన్న ఆధార్,పాన్ కార్డులు తప్పనిసరిగా అవసరం. అయితే మన పాన్ కార్డు లో మన ఫోటో స్పష్టంగా కనిపించదు. మరి ఈ క్రమంలో ఆ ఫోటో ను ఏ విధంగా మార్చుకోవచ్చు? మన ఫోటో బ్లర్ గా ఉంటే సులభంగా మార్చుకోవచ్చా?మరి మార్చుకునే పద్ధతులు ఏంటో? ఒకసారి చూద్దాం..
– మీరు ముందుగా NSDL అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి..
– తర్వాత మీకు అప్లై ఆన్లైన్ రిజిస్టర్ యూసర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.. అందులో మీ యొక్క టైప్ ఆప్షన్ కు వెళ్లి పాన్ కార్డు మార్పిడి ని ఎంచుకోండి..
– దీని తర్వాత అందులో మార్పులు చేర్పులకు సంబంధించి ఆప్షన్ ఎంచుకొని అక్కడ అడిగే వివరాలను నమోదు చేయాలి..
– మళ్లీ కస్టమర్ క్యాప్ చా కోడ్ ను పూరించి, కేవైసీ పూర్తి చేయాలి.
– దీని తర్వాత మీకు స్క్రీన్ పై రెండు ఆప్షన్లు కనబడతాయి. ఒకటి సిగ్నేచర్ సరిపోలడం, రెండవది ఫోటో సరిపోలలేదు. ఇందులో మీకు కావలసిన దాన్ని ఎంచుకుని పూరించి క్లిక్ చేయండి.
Advertisement
Advertisement
– దాని తర్వాత మీరు కోరిన ID రుజువును సమర్పించి, డిక్లరేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
– ఈ ఫోటో ను మార్చే సమయంలో ఆన్లైన్ లో కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అమౌంట్ చెల్లింపు పూర్తయిన తర్వాత ఫోటో మార్పిడి ప్రక్రియ పూర్తవుతుంది.
– దీని తర్వాత మీరు ఒక రశీదును పొందుతారు. ఆ రాశీదు కి సంబంధించిన వివరాలు మొత్తం ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ప్రింటవుట్ తీసుకున్న తర్వాత దాన్ని ఇన్కమ్ టాక్స్ పాన్ సర్వీస్ యూనిట్ కి పంపండి. ఇలా చేయడం వల్ల మీ పాన్ కార్డు లోని ఫోటో చేంజ్ అవుతుంది..
also read:
- మొహర్రం పండుగ మన దేశానికి ఎలా వచ్చిందో తెలుసా..?
- పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు శుభవార్త.. హాల్ టికెట్లు విడుదల ఎప్పుడంటే..?