Home » పోలీస్ కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. హాల్ టికెట్లు విడుద‌ల ఎప్పుడంటే..?

పోలీస్ కానిస్టేబుల్ అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌.. హాల్ టికెట్లు విడుద‌ల ఎప్పుడంటే..?

by Anji
Ad

తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సై ప్రిలిమిన‌రీ రాత ప‌రీక్ష ఆగ‌స్టు 07న ప్ర‌శాంతంగా ముగిసింది. ఎస్సై ప్రాథ‌మిక ప‌రీక్ష‌కు హైద‌రాబాద్ స‌హా మొత్తం 20 ప‌ట్ట‌ణాల్లో ప‌రీక్ష కేంద్రాల‌ను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం 554 ఎస్సై పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌గా ఏకంగా 2, 47,217 ద‌ర‌ఖాస్తులు రాగా.. ప‌రీక్ష‌కు 91.32 శాతం మంది హాజ‌రైన‌ట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది. మొత్తం 2, 25, 759 మంది ప‌రీక్ష రాసిన‌ట్టు వెల్ల‌డించింది. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కీ ని త్వ‌ర‌లో www.tslprb.in వెబ్‌సైట్ లో ఉంచుతామ‌ని రిక్రూట్ మెంట్ బోర్డు వెల్ల‌డించింది. హైద‌రాబాద్ స‌హా ప‌రిస‌ర ప్రాంతాల్లో 503 ప‌రీక్ష‌ల కేంద్రాలు, మిగిలిన జిల్లాల్లో 35 ప‌రీక్ష కేంద్రాల్లో విద్యార్థులు ప‌రీక్ష రాశారు. ఈ ప‌రీక్ష‌లో త‌ప్పు స‌మాధానాల‌కు నెగెటివ్ మార్కులు ఉండ‌డంతో ఇప్పుడు ఇది కీల‌కంగా మారింది.

Advertisement

ఐదు త‌ప్పు స‌మాధానాలు రాస్తే ఒక మార్కు కోత విధించ‌నున్నారు. ఎస్సై మెయిన్స్ లో మాత్రం నెగెటివ్ మార్కులు ఉండ‌వని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంఛ‌నీయ మాస్ కాపీయింగ్ లాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోలేద‌ని పోలీసులు తెలిపారు. అభ్య‌ర్థుల‌ను బ‌యోమెట్రిక్ ఆధారంగానే అనుమ‌తిచ్చామ‌న్నారు. ఎవ‌రైనా ఎస్సై కొలువుకు సంబంధించి డ‌బ్బుల‌ను ఆశ‌చూపితే న‌మ్మ‌వ‌ద్ద‌ని అలాంటి వారితో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అభ్య‌ర్థుల‌కు పోలీసులు సూచించారు. ఇలా ఎవ్వ‌రైనా డ‌బ్బుల‌ను అడిగితే త‌మ దృష్టికి తీసుకురావాల‌న్నారు. ఇదిలా ఉండ‌గా.. అభ్య‌ర్థులు ప్ర‌స్తుతం కానిస్టేబుల్ ప‌రీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 21న ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వ‌హించనున్నారు.

Advertisement


కానిస్టేబుల్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల సంఖ్య ఎస్సై ప‌రీక్ష‌కు హాజ‌రైన వాటి కంటే కూడా ఎక్కువ‌గా ఉంది. మొత్తం 17,281 పోస్టుల్లో 16,694 కానిస్టేబుల్ పోస్టులున్నాయి. ఎక్కువ‌గా ఇవే ఉండడంతో ద‌ర‌ఖాస్తులు పోటాపోటీగా వ‌చ్చాయి. మొత్తం ద‌ర‌ఖాస్తులో ఒక‌టి కంటే ఎక్కువ ఉద్యోగాల‌కు 3.55 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ద‌రఖాస్తులో 2.76 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లున్నారు. ఎస్సై ఉద్యోగాల‌కు 2.47 ల‌క్ష‌లు, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 9.5 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీటిలో అత్య‌ధికంగా హైదరాబాద్‌, రంగారెడ్డి నుంచే ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. కానిస్టేబుల్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌కు సంబంధించి హాట్ టికెట్స్ విడుద‌ల తేదీని బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు. ఆగ‌స్టు 10 నుంచి హాల్ టికెట్లు www.tslprb.in వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచుతామ‌ని బోర్డు అధికారులు వెల్ల‌డించారు.

Also Read : 

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి పాకిస్తాన్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శంస‌.. ఎందుకో తెలుసా..?

చిరంజీవి భార్య వ‌ల్ల రాశి స్టార్ హీరోయిన్ అయ్యిందా…? ఎవ్వ‌రికీ తెలియ‌ని స్టోరీ..!

 

Visitors Are Also Reading