ఒకప్పుడు కాస్త క్రేజ్ ఉన్న హీరో సినిమా విడుదలైందంటే చాలు థియేటర్ ల వద్ద సందడి వాతావరణం కనిపించేది. ఫస్ట్ డే టికెట్లు దొరకొడం అంటే ఓ సాహసం అనే చెప్పాలి. అంతే కాకుండా టికెట్ లు దొరక్క బ్లాక్ లో కొనుకుని సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరో సినిమా విడుదలైనా సరే థియేటర్ వద్ద ఎలాంటి సందడి కనిపించడం లేదు.
Advertisement
ఫ్యాన్స్ తప్ప థియేటర్ లో మరెవరూ కనిపించడం లేదు. దాంతో థియేటర్ ల పరిస్థితి దారుణంగా తయారైంది. కలెక్షన్స్ లేక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ లు దారుణంగా లాస్ అవుతున్నారు. కొంతమంది ధరలు పెంచడమే థియేటర్ లు ఈ విధంగా మారడానికి కారణం అని చెబుతుంటే మరికొందరు ఓటీటీల ప్రభావమే అని చెబుతున్నారు.
Advertisement
ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు థియేటర్ ల ప్రస్తుత పరిస్థితి పై మాట్లాడుతుండగా వివాదాల దర్శకుడు ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. థియేటర్ లకు ఈ పరిస్థితి రావడానికి కారణం రాజమౌళి అని అన్నాడు. టాలీవుడ్ కు రాజమౌళే శత్రువు అంటూ కామెంట్స్ చేశాడు. రాజమౌళి మంచి సినిమా చేసి రెండు వేల కోట్లు వస్తాయని నిరూపించాడు. దాంతో ఇప్పుడు ఆ రేంజ్ లో నిరూపించుకోవడానికి మిగితావాళ్లు కష్టపడుతున్నారు అంటూ కామెంట్స్ చేశాడు.
రాజమౌళి స్టాండర్డ్స్ అందుకునేందుకు డబ్బులు ఎక్కువ ఖర్చుపెట్టడం వల్ల నిర్మాణవ్యయం పెరుగుతోందని అన్నాడు. అయినప్పటికీ దర్శకులు క్వాలిటీ కోసం నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. రాజమౌళి తరవాత ఓటీటీ, యూట్యూబ్ కూడా సమస్యగా మారాయని అన్నారు. ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఫుల్ గా దొరకడంతో థియేటర్ కు వెళ్లడం టైం వేస్ట్ అని భావిస్తున్నారంటూ కామెంట్స్ చేశాడు.
ALSO READ : మీడియాలో ఆ వార్త చూసి కండ్లు ఎర్రబడేలా ఏడ్చేసిన ఉదయ్ కిరణ్..! ఆ వార్త ఏంటంటే..?