రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు బైక్ పై నుండి కింద పడిపోయాడు. పడిపోయిన వెంటనే అతడు స్పృహ కోల్పోయాడు. చుట్టూ జనం ఉన్నా ఏం చేయాలో తోచక అలానే చూస్తూ ఉండిపోయారు. యువకుడిలో చలనం లేదు..అంతలోనే లో నర్సు దేవతలా వచ్చింది. అందరినీ పక్కకి జరగమంది. ఆమె నర్సు అన్న సంగతి అక్కడ ఉన్నవాళ్లకు తెలియదు. దాంతో ఆమె ఏం చేస్తుందా అని అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ నర్సు యువకుడికి సీపీఆర్ చేయడం మొదలు పెట్టింది. తన రెండు చేతులని యువకుడి హార్ట్ పై పెట్టి సీపీ ఆర్ చేసింది. దాంతో ఆ యువకుడిలో చలనం మొదలయ్యింది.
అతడికి మెల్లిగా స్పృహ వచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని కరువకుర్చి లో డిసెంబర్ 3న చోటు చేసుకుంది. వసంత్ అనే విద్యార్థి రోడ్డు బైక్ తో వెళుతున్న సమయంలో కిందపడిపోయాడు. ఆ తరవాత అతడు స్పృహ కోల్పోయాడు. దాంతో అంతా చూస్తూ నిలుచుంటే అక్కడకు వచ్చిన వనజ అనే కాంట్రాక్ట్ నర్సు మాత్రం అతడికి సీపీఆర్ చేసింది.
Advertisement
Advertisement
వెరైటీ : పెంపుడు కుక్కకు సీమంతం
దాంతో ఆ యువకుడికి మళ్లీ ప్రాణం పడింది. కరెక్ట్ గా సీపీఆర్ చేయడం తో ఆ యువకుడికి మళ్లీ ప్రాణం పడింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నర్సు వనజ వెంటనే స్పందించి యువకుడికి ప్రాణం పోయడంతో ఆ యువకుడి ప్రాణం దక్కింది అంటూ నెటిజన్లు ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.