తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అర్చన తపన అనే మూవీ ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, సామాన్యుడు, నేను వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత ఆమెకు సరైన అవకాశాలు రాక, దీనికి తోడు వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల కెరియర్ మధ్యలోనే కాస్త ఆగిపోయింది. దీని తర్వాత మలయాళ,కన్నడ,తమిళం లో కూడా మంచి పాత్రలు చేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత బిగ్ బాస్ మొదటి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Advertisement
ఇటీవల వివాహం చేసుకొని మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్న అర్చన ఇండస్ట్రీలోని వాళ్ల పరిస్థితులు గురించి ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది.. ఇంతకీ ఆమె ఏమన్నది అంటే.. తెలుగు ఇండస్ట్రీలో మేల్ సెంట్రిక్ సమాజంలో ఉన్నామని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇటీవల ఒక నిర్మాత సినీ ఆఫర్స్ కోసం పిలిచి నీకు పెళ్లయింది కదా పారితోషకం తగ్గించుకోవాలని అన్నాడు. అదే నిర్మాత హీరోలకు పెళ్లై పిల్లలు ఉన్నా వారి పిల్లలు కూడా హీరోలు అవుతున్న రోజుల్లో వారి యొక్క రెమ్యూనరేషన్ తగ్గించమని అడగగలడా అని కామెంట్ చేసింది. సినిమాల్లో హీరోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, కానీ బాలీవుడ్లో మాత్రం కమర్షియల్ సినిమాలు వస్తున్నా హీరోయిన్లకు కూడా ప్రాధాన్యత ను ఇస్తారు అని అన్నారు.
Advertisement
కానీ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదని, కానీ ఇప్పుడిప్పుడే సినిమాల ధోరణి మారుతోందని, హీరోయిన్ల కు కూడా మంచి మంచి పాత్రలు వస్తున్నాయంటూ చెప్పింది. తన కెరీర్ ప్రారంభంలో ఏమీ ఆలోచించకుండా కొన్ని పాత్రలు చేశానని, తర్వాత ఆలోచించి సరైన పాత్రలు ఎంచుకున్నట్లు తెలియజేసింది. ఆమె మలయాళంలో ఒక సినిమాలో చేసే సమయంలో హీరో మెసేజ్ లు పెట్టడం తో అది భరించలేక మూవీల నుంచి తప్పుకున్నట్లు తెలియజేసింది. ఆ సమయంలో మా అమ్మ నాన్న నాకు అండగా నిలబడారని వారే నా బలం అని చెప్పుకొచ్చింది అర్చన.
also read;