దర్శకుడు కోడి రామకృష్ణ గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఆయన దాదాపు 100 చిత్రాలకి పైగా దర్శకత్వం వహించాడు. దర్శకుడు కోడి రామకృష్ణ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన దర్శకత్వంలో వహించిన సినిమాల్లో 100 కి పైగా సినిమాలు 100 రోజులు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టినవే. అందుకే ఆయనను శత చిత్రాల దర్శకుడు అని పిలుస్తుంటారు. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వ శాఖలో పని చేసిన కోడి రామకృష్ణ దర్శకుడిగా మారుతూ మెగాస్టార్ చిరంజీవి తో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా చేశారు.
Advertisement
ఇక ఈ సినిమా 560 రోజులు నడిచింది. దీంతో క్రేజీ డైరెక్టర్ గా మారిన ఆయనతో పలువురు స్టార్ హీరోలు సినిమా చేసేందుకు ఆసక్తి చూపించారు. వీరిలో నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమాలు నిర్మించి సూపర్ హిట్ సాధించింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఒక సినిమా మాత్రం సగం చిత్రీకరణ పూర్తి అయిన తరువాత ఆగిపోయింది. 1984లో వీరిద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా మంగమ్మ గారి మనవడు. ఇందులో కీలక పాత్ర పోషించిన భానుమతి గారిని బాలయ్య బామ్మ పాత్రకి ఒప్పించడానికి దర్శకుడు కోడి రామకృష్ణ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇందుకు ఆమె ఒప్పుకుంది కాబట్టే ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది.
Advertisement
భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో బాలయ్య-కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ఏడు సినిమాలు వచ్చాయి. వాటిలో ఒక సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ హిట్ గా నిలిచాయి. దీంతో సక్సెస్ పుల్ కాంబినేషన్ అయిన బాలకృష్ణ-కోడిరామకృష్ణ కాంబోలో 8వ సినిమాగా విక్రం సింహ భూపతి అనే సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్ సగం పూర్తవ్వగానే నిర్మాత అనూహ్యంగా మృతి చెందారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా విడుదలవ్వకుండా ఆగిపోయిన సినిమాగా విక్రం సింహ భూపతి మిగిలింది. బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో బాలకృష్ణకి సూపర్ హిట్స్ అందించి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడిగా కోడి రామకృష్ణ కావడం విశేషం.
Also Read :
గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి కంటే ముందే ఎవరు చేయాల్సిందో తెలుసా..?
శ్రీదేవి ఆ స్టార్ హీరోని పెళ్లి చేసుకుంటానంటే ఆ అమ్మాయి అడ్డుపడటానికి కారణం..?