అమ్మాయి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అమ్మాయి వయసుకు వచ్చినప్పటి నుండి ఆమె పెళ్లికి కావాల్సిన డబ్బును సమకూర్చడం. కట్నంగా ఇవ్వాల్సిన డబ్బులను సమకూర్చడం ఇలా ఎంతో కష్టపడుతుంటారు. ఏ తల్లి దండ్రులయినా తమ కూతురు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అందుకోసం తమ స్థోమతకు తగినట్టు మంచి అబ్బాయి కోసం వెతికి పెళ్లి చేస్తారు. అయితే పెళ్లి తరవాత కొంతమంది తమ పుట్టింటి వాళ్లు తమకు చేసిన దాంట్లో అంత్రుప్తితో అత్తింట్లో వారి గురించి చాడీలు చెబుతుంటారు. కాగా అలా చెప్పకూడదని పెద్దలు చెబుతున్నారు. అత్తింట్లోనే కాకుండా బయటివాళ్ల తోనూ తమ తల్లి దండ్రులను కూడా తక్కువ చేసి మాట్లాడకూడదని చెబుతున్నారు.
Advertisement
తనకు మరింత కట్నం ఇచ్చి వివాహం చేసి ఉంటే మంచి ఉద్యోగంలో ఉన్న భర్త వచ్చేవాడని అత్తగారింట్లో తల్లిగారి గురించి చెప్పకూడదట. అలా చెప్పడం వల్ల భర్తను తక్కువ చేసి చూడటం తో పాటూ తల్లిదండ్రలను కూడా తక్కువ చేసి మాట్లాడినట్టు అవుతుందట.
Advertisement
ప్రస్తుత కాలంలో తల్లి దండ్రులు తమ కొడుకులతో సమానంగా అమ్మాయిలను కూడా చదివిస్తున్నారు. పెళ్లి వయసు వచ్చిన తరవాతనే పెళ్లి చేస్తున్నారు. కానీ కొందరు చదివించలేదని లేదంటే ఉద్యోగం చేసేవాళ్లని చెబుతున్నారట. అలా చెప్పడం కూడా తల్లి దండ్రులను తక్కువ చేసినట్టు అవుతుందట.
కొంతమంది నచ్చని పెళ్లి చేశారని అందరికీ చెప్పుకుంటారని..కానీ పెళ్లి చేసుకునే సమయంలో మాత్రం ఇష్టపడే చేసుకుంటారని చెబుతున్నారు. అలా కూడా చెప్పవద్దని చెబుతున్నారు.
పుట్టింట్లో ఏమైనా కష్టాలు పడినా అవి అత్తింట్లో చెప్పకూడదట. అలా చెప్పడం వల్ల అత్తింటి వారికి అలుసు అయిపోయే అవకాశం ఉందట.
తల్లిదండ్రులు ఆస్థిపాస్తులు ఇవ్వలేదని కూడా కొందరు ఆరోపిస్తారని అలా చెప్పి తల్లిదండ్రలను తక్కువ చేయకూడదని చెబుతున్నారు. తల్లి దండ్రులు తమకు ఉన్నదాంట్లో ఇస్తారని లేనిదాని కోసం వారిని నిందించడం సరికాదని పెద్దలు చెబుతున్నారు.
Also read : నరసింహ నాయుడు సినిమాను ఆ రియల్ స్టోరీ ఆధారంగా తీశారని తెలుసా…? ఎక్కడ జరిగిందంటే…?