సాధారణంగా మనం వెజిటేరియన్,నాన్ వెజిటేరియన్ అనే రెండు ఆహారపదార్థాలు తింటూ ఉంటాం. అందులో వెజిటేరియన్ తిన్నప్పుడు మన పొట్ట ఫ్రీ గా తొందరగా జీర్ణం చేసుకుంటుంది. అదే నాన్ వెజ్ తిన్నప్పుడు పొట్ట ఉబ్బి కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం దీన్ని క్లియర్ గా గమనించవచ్చు. రెగ్యులర్ గా మాంసం తినే వారిని మరియు కూరగాయలు తినే వారిని గమనిస్తే వారి బాడీ లలో కూడా చాలా తేడాలు కనిపిస్తాయి. సాధారణంగా మాంసం తినడం తినక పోవడం అనేది వారి ఇష్టాయిష్టాల ప్రకారం ఉంటుంది.
Advertisement
అది మాంసమే కాదు ఏ అలవాటైన సరే ఈ విధంగానే ఉంటుంది. కొంతమందికి మాంసం లేకుంటే ముద్ద దిగదు.. ఇంకొంతమంది అసలు మాంసం వైపు కూడా చూడరు. అలా అని మాంసం ఎవరు తినకూడదు అని కాదు.. మాంసం తినడం వల్ల మన బాడీ లో ఎక్కువగా కొవ్వు పదార్థాలు పెరిగి అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. పూర్వ కాలంలో ఎక్కువ మంది యుద్ధవీరుల ను మాంసం తినమని చెప్పేవారు. ఎందుకంటే వారు మాంసం తింటేనే బలంగా ఉండి యుద్ధం చేయగలుగుతారు. వారు ఏమీ తినకుండా బక్కచిక్కినట్టు ఉంటే యుద్ధం చేయలేరు.
Advertisement
వారు మాంసం తినడం వల్ల బలంగా ఉండి యుద్ధాన్ని ఎదుర్కొని మిగతా వారికి రక్షణగా ఉంటారు.. ఏది ఏమైనా ఎవరికి వారే త్రికరణ శుద్ధి తో దాన్ని మానుకోవాలి అంటే మానుకోవచ్చు.. లేదనుకుంటే పాటించవచ్చు. అది మాంసం విషయమే కాదు ఇతర ఏ వ్యసనం అయినా అలాగే ఉంటుంది. కాబట్టి మాంసాహారం తినడం వల్ల కొన్ని దుష్పరిమాణాలు ఎదురవుతాయని అంటున్నారు నిపుణులు.
also read:
- మరో బిజినెస్ ప్రారంభించబోతున్న మహేష్ బాబు..!
- చివరి రోజుల్లో అరుంధతి నటి అన్ని కష్టాలు అనుభవించారా..కుటుంబ సభ్యులే కేసులు వేసి..!