ప్రస్తుత కాలంలో చాలామంది వారి ఆహారపు అలవాట్ల వల్ల చిన్న వయసు నుంచే తెల్ల జుట్టు సమస్య బాధిస్తోంది. చాలామందిలో ఎక్కువగా కనిపిస్తున్న ఈ సమస్య అధిక ఒత్తిడి నిద్రలేమి, ఆహారపు అలవాట్లు వంటివి కారణాలు కావచ్చు. ఈ సమస్య యువతీ, యువకులను ప్రధానంగా బాధిస్తోంది. ఈ సమస్యను అధిగమించడానికి చాలా మంది కెమికల్స్ వాడుతూ ఉన్న జుట్టును కూడా పాడు చేసుకుంటున్నారు.. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన చిట్కా తీసుకొచ్చాం.. ఏంటో మీరు చూడండి..
Advertisement
మీకు చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడిపోతున్నాయా అయితే చింత చెట్టు ఆకులు మంచి ఫలితాన్ని ఇస్తాయి.. చింత ఆకుల్లో ఉండేటువంటి విటమిన్లు, మినరల్స్ ఇందుకు దోహదపడతాయి. చింత ఆకుల వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా కాపాడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ఉంటుంది. ఈ ఆకులతో జుట్టు స్ప్రే ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో చూడండి.. ముందుగా ఒక గిన్నెలో ఐదు కప్పుల నీరు తీసుకుని, అందులో సగం కప్పు చింతాకులు మిక్స్ చేయాలి. ఈ రెండింటినీ కలిపి ఉడికించాలి..
Advertisement
ఇది బాగా ఉడికిన తరువాత చల్లార్చి జుట్టుకు అప్లై చేసుకోవాలి.. కొద్దిసేపటి తర్వాత శుభ్రమైన నీళ్ళతో కడిగేయాలి. ఈ ప్యాక్ తయారు చేసేందుకు కొన్ని ఆకులు, పెరుగుతో కలిపి మిక్స్ చేసి గ్రైండ్ చేయాలి. ఈ పేస్ట్ ను జుట్టుకూ రాస్తూ మసాజ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.. చింత ఆకుల్లో సహజసిద్ధమైన హెయిర్ కలర్ ఏజెంట్స్ ఉంటాయి. ఇలా వారం రోజులపాటు అప్లై చేసుకుంటే మీ తెల్ల జుట్టు నల్లగా అవ్వటమే కాకుండా హెయిర్ ఫాల్ నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది.
also read:
- Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోకూడదు
- లైఫ్ పాట్నర్స్ తో మన ఫ్యూచర్ కనిపించట్లేదు అనుకున్నపుడు ఏం చేయాలో తెలుసా ?