సాధారణంగా పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఐస్ క్రీమ్ తినడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఎక్కువగా వేసవికాలం వచ్చిందంటే ఐస్ క్రీమ్ లవైపు మొగ్గు చూపుతుంటారు. వేసవి కాలంలో ఐస్ క్రీమ్ తింటే ఆరోగ్యంపై పెద్దగా ఇబ్బందులుండవు. కానీ వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటే మాత్రం ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ సమయంలో వేడి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలా కాకుండా చల్లని పదార్థాలను తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఐస్ క్రీమ్ వంటి వాటిని తీసుకుంటే దాని ప్రభావంతో జలుబు, దగ్గు, ఛాతీలో బారం వంటి సమస్యలు వస్తాయి. ఇక ఇన్ఫెక్షన్ కారణంగా వ్యాధుల బారీన పడే ప్రమాదం కూడా లేకపోలేదు. వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బలహీన పడుతుంది. గొంతు సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక ఐస్ క్రీమ్ లో చక్కర, కేలరీలు, కొవ్వు ఉంటాయి. ఊబకాయం, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఐస్ క్రీమ్ లు తినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలు అధికమవుతాయి. వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తినడం వల్ల మెదడు నరాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. తలనొప్పి, దంత సమస్యలు వచ్చే అవకాశముంటుంది. ఐస్ క్రీమ్ తినడం వల్ల రక్తంలో చక్కర స్థాయి పెరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా అదికంగా బరువు పెరగే ఆస్కారం ఉంటుంది.
Also Read :
పిల్లలు బరువు పెరిగేందుకు ఈ ఆహారం తప్పకుండా ఇవ్వండి..!
రాత్రి ఎనిమిది తరువాత ఈ ఆహారాలు అస్సలు తినకూడదు.. తింటే ఆ సమస్యలు తప్పవు..!