Home » జక్కన్న ప్రతి సినిమా విజయం వెనుక అసలు కారణం ఇదేనా..?

జక్కన్న ప్రతి సినిమా విజయం వెనుక అసలు కారణం ఇదేనా..?

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీ పేరును ఎల్లలు దాటించి, అందరి చూపును ఇండస్ట్రీపై పడేలా చేసిన డైరెక్టర్ రాజమౌళి.. ఆయన సినిమా తీశాడు అంటే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు జక్కన్న స్టూడెంట్ నెంబర్ 1 మూవీ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు 12 సినిమాలు తీసారు. ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది. సినిమాల్లో కొత్త నటులను పెట్టి కూడా హిట్ కొట్టిన దాఖలాలు అనేకం. చివరికి కామెడీ యాక్టర్ సునీల్ ను కూడా హీరోని చేసిన ఘనత ఆయనదే. మరి ఆయన ఏ సినిమా తీసిన విజయం సాధించడానికి కారణం ఏమిటి.. ఒకసారి చూద్దాం.. కొన్ని వేల సంవత్సరాలు అయినటువంటి మహాభారతం జనాలని ఎందుకు ఆకట్టుకుంటోంది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి కథ,ఎమోషనల్ అలాంటిది.

Advertisement

మహాభారతం కథలో నాయకులు ఎంత ప్రతిభావంతులో ప్రతి నాయకులు కూడా అంతే ప్రతిభావంతులు. అదే విషయాన్ని మైండ్ లో పెట్టుకున్న రాజమౌళి సినిమా తీస్తుంటారు. అంతేకాకుండా మాయాబజార్ లాంటి పాత సినిమాలు ఆయనను ప్రభావితం చేశాయని పలు ఇంటర్వ్యూలలో అన్నారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథారచయిత కావడం, రాజమౌళి సినిమాలకు మంచి కథలు అందించడం అతని విజయాలకు మెట్టు అని చెప్పవచ్చు. కొత్త సినిమాలో తప్పనిసరిగా ఎమోషన్ ఉండేట్టు చూసుకోవడం, టేకింగ్ లో ఖచ్చితమైన టువంటి నియమాలను పాటించడం చేస్తారు ఆయన.

Advertisement

 

అందుకే రాజమౌళి తీసిన సినిమా చూసిన ప్రేక్షకులు ఆ స్టోరీ గురించే మాట్లాడుకుంటారు. ఎందుకంటే ప్రేక్షకుల మైండ్ కు అంత కనెక్ట్ అవుతుంది. విలన్ పాత్రకు రాజమౌళి ఇచ్చే గుర్తింపు మాత్రం మరి ఏ డైరెక్టర్ కూడా ఇవ్వనంత ఇస్తారు. సినిమాలో ప్రతి విషయాన్ని వెరైటీగా ఆలోచించి చేసే ఘనత ఆయనది. ఎక్కువ టైం తీసుకొని పాత్రను క్రియేట్ చేయడం వల్ల జక్కన్న అనే పేరు కూడా వచ్చింది. ఈ విధంగా ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అవుతోంది.

ALSO READ:

Visitors Are Also Reading