Home » పిల్ల‌లు బ‌రువు పెరిగేందుకు ఈ ఆహారం త‌ప్ప‌కుండా ఇవ్వండి..!

పిల్ల‌లు బ‌రువు పెరిగేందుకు ఈ ఆహారం త‌ప్ప‌కుండా ఇవ్వండి..!

by Anji
Ad

సాధార‌ణంగా పిల్లలు ఎక్కువ శాతం అన్ని ఆహారాలను ఇష్టపడరు. పిల్లలకు పౌష్టికాహారం అందించడం పెద్ద కష్టమే. సమయానికి భోజనం పెట్టడం పెద్ద పని. ఎదిగే వయసులో పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలి. దీనికోసం కొన్ని చిట్కాలున్నాయి. పిల్ల‌లు స‌రిగ్గా తినకుండా రోజు రోజుకు బరువు తగ్గిపోతారు. పిల్లలు కొందరు తినడానికి నిరాకరిస్తుంటారు. చాలామంది పిల్లలు ఫుడ్ తిన్న‌ప్ప‌టికీ చాలా బలహీనంగా ఉంటారు. ఇలాంటి వారికి సరైన పౌష్టికాహారం ఎలా అందించాలనేది తల్లిదండ్రులకు పెద్ద‌ సవాలుగా మారింది. పిల్లలు ప్రతిరోజు తగిన ఆహారం తీసుకోవాలి. పిల్లలు ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి ఏ ఆహారాలు సహాయపడతాయో తెలుసుకోండి.

అర‌టిపండు :

Advertisement

అరటి పండ్లు త్వరితగతిన శక్తిని అందిస్తాయి. పూర్తిగా కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. ఆరోగ్యకరమైన బరువు పెరగడం మంచిది. అదనంగా ఈ బహుముఖ పండును మిల్క్ షేక్ లు, ఫ్రూట్ సలాడ్ లు, క్రీము డేజర్ట్ ల రూపంలో తీసుకోవచ్చు. పిల్లలు దీని ఇష్టపడి తింటారు.

నెయ్యి:

దేశీ నెయ్యిలో కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలతో పాటు విటమిన్లు ఇ, కె ఉంటాయి. ఈ విటమిన్లు, పోషకాలు బరువు పెరిగేందుకు స‌హాయ కారిగా ఉంటాయి.

Advertisement

పాలు:

పాలు లేదా క్షీర‌ము శ్రేష్ట‌మైన బ‌ల‌వ‌ర్థ‌క ఆహారం. అన్ని ర‌కాల పోష‌క విలువ‌లున్నాయి. విట‌మిన్ సి, ఇనుము త‌క్కువ‌గా ఉంటుంది. ఇవి అన్ని వ‌య‌సుల వారు తీసుకోగ‌ద‌గిన ఉత్త‌మ ఆహార ప‌దార్థం. ముఖ్య‌గా శిశువు ఆహారంలో పాలు చాలా కీల‌కం. కాల్షియం వ‌ల్ల బ‌ల‌మైన ఎముక‌ల‌ను నిర్మించ‌డ ఉప‌యోగ‌ప‌డుతుంది.

గుడ్లు :

గుడ్ల‌లో ఉండే ప్రోటీన్లు, విట‌మిన్లు ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు అధికంగా ఉంటాయి. పిల్ల‌లు బ‌రువు పెర‌గ‌డానికి అత్యంత ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారంగా ఇవి పెరుగుతాయి. ముఖ్యంగా బ‌రువు పెర‌గడానికి ఉప‌యోగ‌ప‌డుతాయి.

బంగాళ దుంప‌లు :

బంగాళ‌దుంప‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పిల్ల‌లు బ‌రువు పెర‌గ‌డానికి సాయ‌ప‌డుతాయి. కూర‌గాయ‌ల‌తో కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు, డైట‌రీ ఫైజ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది బ‌రువును ఆరోగ్య‌క‌ర‌మైన సంబంధాన్ని చేస్తుంది. అదనంగా, ఇది రుచికరమైంది, పిల్లలకు చాలా ఇష్టమైనది కూడా.

Also Read : 

“గంగోత్రి” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..? ఏం చేస్తుందంటే..!

 

Visitors Are Also Reading