ఈ మధ్యకాలంలో మగవాళ్లు పరాయిస్త్రీల మోజులో పడి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేస్తున్నారు. ప్రతిరోజూ ఎక్కడో ఒకదగ్గర అక్రమసంబంధాల వల్ల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా పరాయి స్త్రీల మోజుల్లో కుటుంబాన్ని పట్టించుకోని భర్తలు కూడా ఉన్నారు. ఇక భర్తలు మరో స్త్రీతో సంబంధాలు పెట్టుకోవడంతో విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి.
Advertisement
అయితే భర్తలు పరాయిస్త్రీ ల మోజులో పడకూడదు అంటే భార్యలు ఇలా చూసుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. భర్త ఉద్యోగానికి వెళ్లి వచ్చిన వెంటనే అతడికి భోజనం పెట్టి తమ కుటుంబం లో జరుగుతున్న విషయాల గురించి చర్చించాలట. దాంతో భర్తలకు తమ భాధ్యతలు గుర్తుకువస్తాయట. అలా బాధ్యతలు గుర్తుంటే పక్కదారి పట్టే అవకాశం ఉండదట.
Advertisement
అంతే కాకుండా భర్తతో తరచూ గొడవలు పడుతూ అతడికి చిరాకు తెప్పిస్తే ఇంట్లో దొరకని ప్రేమను వాళ్లు భయట వెతుక్కునే అవకాశం ఉందట. ఈ నేపథ్యంలోనే అక్రమసంబంధాలు పెరిగిపోతున్నాయని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా భార్యలు భర్తలకు నచ్చేవిధంగా ఉంటే ఎలాంటి సమస్యలు తలెత్తవని చెబుతున్నారు. భర్త అవసరాలను అన్నింటిని భార్య తీర్చగలిగితే ఆమెపై ప్రేమ రెట్టింపు అవుతుందట.
పొగరుగా వ్యవహరించడం…నీకంటే నేనే గొప్ప అన్నట్టుగా వ్యవహరించినా కూడా భర్తలకు భార్యపై ఉన్న ప్రేమ తగ్గిపోయే ప్రమాదం ఉందట. అంతే కాకుండా భర్త ఉద్యోగం రిత్యా లేదంటే ఏదైనా పనికోసమైనా భయటకు వెళ్లినా తిన్నారా..? ఏం చేస్తున్నారు అంటూ ఫోన్ చేసి మంచి చెడులు తెలుసుకోవడం వల్ల భార్యకు తనపై ఉన్న ప్రేమ చూసి భర్తలు పక్కదారి పట్టే ఆలోచన ఉన్నా దాన్ని మార్చుకుంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు.