ప్రపంచంలో తొలుత విమానాన్ని కనుగొన్నది ఎవరు అనగానే టక్కున రైట్ సోదరులనే సమాధానం వినిపిస్తుంది. మొట్టమొదటి విమానాన్ని కనిపెట్టింది రైట్ సోదరులు కాదండోయ్. మన భారతదేశానికి చెందిన సివ్కుర్ బాపూజీ తల్పాడే. చరిత్ర ప్రకారం.. 1903 డిసెంబర్ 17న రైట్ సోదరులు ప్రపంచంలోనే మొదటి విమానానని రూపొందించి ప్రయోగించారు.
యంత్రం బరువును మించిన గాలిని సృష్టించడం ద్వారా గాలిలోకి ఎగురవచ్చని కనుగొన్నారు. దీని ఆధారంగానే ప్రస్తుతం గాలిలో ఏవియేషన్ రంగం నిలబడింది. అయితే రైట్ సోదరులు తమ విమానాన్ని ప్రయోగించడానికి సుమారుగా ఎనిమిదేళ్ల ముందే అనగా 1895లో భారతీయుడు సివ్కుర్ బాపూజీ తల్పాడే ప్రపంచపు తొలి విమానాన్ని రూపొందించాడు. ఇతను సంస్కృత పండితుడు. సివ్కుర్ బాపూజీ మరుసక్తి అనే పేరుతో విమానాన్ని తయారు చేశాడు.
Advertisement
ప్రాచీన సాంస్కృతిక గ్రంథాల్లో రూపొందించిన వేద పరిజ్ఞానం ఆధారంగా బాపూజీ తల్పాడే ఈ మొదటి విమానాన్ని రూపొందించారు. భారీ జనసందోహం ముందు ముంబయిలోని చౌపతి తీరంలో బాపూజీ తల్పాడే తొలి విమానాన్ని విజయవంతంగా నడిపి చూపించారు. రైట్ సోదరులు నిర్మించిన మొదటి విమానం 120 అడుగుల వరకు ప్రయాణించిందని.. తొలిసారి విమానంలో ప్రయాణించిన వ్యక్తిగా ఆర్విల్లీ రైట్ నిలిచాడు. భారతీయ సంస్కృత పండితుడు బాపూజీ తల్పాడే రూపొందించిన విమానం సుమారు 1500 అడుగుల దూరం ప్రయాణించింది. అప్పట్లో ప్రముక వార్తా పత్రిక కేసరి న్యూస్ పేపర్ ఈ కథనాన్ని ప్రచురించింది.
Advertisement
సివ్కుర్ బాపూజీ తల్పాడే భారతీయ సంస్కృత పండితులు. చిన్నతనం నుంచే పాండిత్యమంటే తల్పాడే కు చాలా ఇష్టం. సంస్కృతంలోని వైమానిక్ వాస్త్ర పట్ల ఆకర్షితుడయ్యాడు. చారిత్రక పత్రాల ఆధారంగా వైమానిక శాస్త్రం, దాని సాంకేతికత గురించి సంస్కృతంలో వివరించాడు. అందులో పరిజ్ఞానం ఆధారంగానే నాసా ఆయాన్ యంత్రాన్ని అభివృద్ధి చేసిందనే రూమర్స్ వినిపించాయి.
ప్రధానంగా 1800-1900 మధ్యకాలంలోనే సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చిందనే చెప్పాలి. ఆ కాలంలో ప్రయోగదశలో ఉన్న ఆవిస్కరణలను ఇప్పుడు పలు అసరాలకు ఉపయోగించుకుంటున్నాం. ఆ శతాబ్దకాలంలో అనేక దేశాలు విమానాల మీద తీవ్ర ప్రయోగాలు చేశాయి. ప్రపంచపు తొలి విమానంలో మొదటిసారి ప్రయాణించిన వ్యక్తిగా అర్విల్లీ వైట్ ఉన్నాడు. ఇతని కంటే ఎనిమిదేళ్ల ముందు సివ్కుర్ బాపూజీ తల్పాడే రూపొందించిన తన మొదటి విమానంలో ప్రయాణించాడు.
Also Read :
హీరోయిన్ కళ్యాణితో దర్శకుడు సూర్యకిరణ్ విడాకులు తీసుకోవడానికి కారణం అదేనా..?
అఖిల్ సినిమా విషయంలో ఆ తప్పు చేసి ఉండకుంటే సినిమా మరోలా ఉండేదంటున్న వినాయక్..!