ఎవరైనా సరే జీవితంలో ప్రత్యేక స్థానానికి ఎదగాలని ఒక గోల్ నిర్ణయించుకొని దానికి తగ్గట్టే ముందుకు సాగి పోతూ ఉంటారు. అలాంటి వారు వారి జీవితం సంబంధించిన కొన్ని విషయాలను వేరొకరి చేతుల అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఇంకొకరు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఈ సంఘటన సీనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగింది. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రముఖ నటుడు కెరియర్ మధ్యలోనే నాశనమైంది.. మరి ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం ఏమిటి.. ఆ నటుడు జీవితం ఎందుకు మధ్యలో ఆగిపోయింది.ఆ వివరాలు తెలుసుకుందాం.
శంకరాభరణం మూవీతో మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు ఎవరు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది సోమయాజులు. ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా ఆయనకి ఇంటిపేరుగా కూడా మారింది. ఆయన వెండితెర, బుల్లితెర అనే తేడా లేకుండా అన్ని పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తన సోదరుడైన రామణమూర్తితో కలిసి అనేక నాటకాలలో ప్రదర్శనలిచ్చారు. వీరిద్దరూ సినిమా రంగంలో కొన్ని సంవత్సరాల పాటు కొనసాగారు. అయితే సోమయాజులు ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సినిమాలు మరియు నాటకాలు సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు. దాదాపు ఆయన 150 సినిమాల్లో నటించారు.
Advertisement
Advertisement
ఇదిలా ఉండగా సోమయాజులు తన 55 ఏళ్ల వయసులో ఉన్న సమయంలో సీనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల అతని జీవితమే అంధకారంలో పడింది. 55ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగం విరమణ చేయాలని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకోవడంతో అనేక మంది వారి ఉద్యోగాలను వదులుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే రాష్ట్ర సాంస్కృతిక శాఖకు డైరెక్టర్ గా చేస్తున్నటువంటి సోమయాజులు కూడా ఉద్యోగం నుంచి తప్పుకోవడంతో అనేక ఇబ్బందులు ఆయన చుట్టుముట్టాయి. ఇక చివరికి ఆంధ్ర యూనివర్సిటీ సోమయాజులకు మరొక గౌరవంతో సత్కరించింది. రంగస్థలం శాఖకు హెడ్ గా నిర్ణయించడంతో ఆయన పరిధిలో అనేక నాటకాలు మళ్లీ ప్రదర్శించబడ్డాయి.
also read:
- రూ.150 కోట్లకు పైగా బడ్జెట్ మించిపోయిన టాప్ 5 సినిమాలు ఇవే..!
- మీ జీవిత భాగస్వామిని చేసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి