Home » రూ.150 కోట్లకు పైగా బ‌డ్జెట్ మించిపోయిన టాప్ 5 సినిమాలు ఇవే..!

రూ.150 కోట్లకు పైగా బ‌డ్జెట్ మించిపోయిన టాప్ 5 సినిమాలు ఇవే..!

by Anji
Published: Last Updated on
Ad

ప్ర‌స్తుతం ఉన్న త‌రుణంలో సినీ ఇండ‌స్ట్రీకి డిమాండ్ బాగా పెరిగింది. ఇది వ‌ర‌కు సినిమాలు చూడాలంటే ఎక్కువ‌గా సినిమాల‌ను ఫ్యామిలీతో క‌లిసి కేవ‌లం థియేట‌ర్ల‌లో చూసేవారు. ప్ర‌స్తుతం థియేట‌ర్‌ల‌తో పాటు, ఓటీటీలో చూడడం మెల్ల‌మెల్ల‌గా అలవాటు చేసుకుంటున్నారు. ఇది వ‌ర‌కు పెద్ద హీరోకు సంబంధించి కొత్త సినిమా విడుద‌లవుతుందంటే అర్థరాత్రి లైన్ క‌ట్టేవారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి మారిపోయింది. అంతా ఆన్‌లైన్ లోనే బుకింగ్ చేసుకుంటున్నారు. ఇంత‌కు ముందు సినిమా ఎన్ని రోజులు ఆడింద‌నే విష‌యం గురించి మాట్లాడుకునే వారు. కానీ ఇప్పుడు ఎన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల అయింది. ఎంత వ‌సూలు చేసింద‌నే విష‌యం గురించే చ‌ర్చించుకుంటున్నారు.

Advertisement

ఇక దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి సంవ‌త్స‌రం అన్ని భాష‌ల్లో క‌లిపి దాదాపు 2వేల సినిమాల వ‌ర‌కు విడుద‌ల‌వుతున్నాయి. సాధార‌ణంగా ప‌రిమిత సంఖ్య‌లో భారీ బ‌డ్జెట్ సినిమాలు వ‌స్తుండ‌గా.. ప్ర‌స్తుతం ట్రెండ్ మారిపోయింది. ఇది వ‌ర‌కు కేవ‌లం ఒక భాష సినిమాను అదే భాష‌లో విడుద‌ల చేసేవారు. కానీ ఇప్పుడు ఒక భాష సినిమాను దేశ‌వ్యాప్తంగా అన్ని భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఎక్కువ మంది ప్రేక్షకుల‌ను చేరుకోవ‌డానికి ఈ మ‌ధ్య కాలంలో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ కేజీఎప్ 2, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కి బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధించిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా.. 2022-23 సీజ‌న్ లో 150 కోట్ల‌కు మించిన బ‌డ్జెట్ సినిమాల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement


టాప్ పైవ్ భార‌తీయ సినిమాల్లో మ‌ణిర‌త్నం పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమా ఒక‌టి. ఈ చిత్రం పిరియాడిక‌ల్ డ్రామా క‌తాంశంతో తెర‌కెక్క‌బోతుంది. రెండ‌వ‌ది షంషేరా. బాలీవుడ్ స్టార్ హీరో ర‌న్‌బీర్ క‌పూర్ న‌టిస్తున్న సినిమా రూ.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందింది. ఈ సినిమా 1800 నాటి పీరియాడిక‌ల్ డ్రామా క‌థాంశంతో తెర‌కెక్క‌నుంది. మ‌రో సినిమా పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ హీరోగా ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఆదిపురుష్‌. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌నుంది. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్, ప్ర‌భాస్ స‌ర‌స‌న కీతిస‌న‌న్ న‌టించ‌నున్నారు. ఇక మ‌రో సినిమా టైగ‌ర్ 3. ఈ చిత్రం దాదాపు 225 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతుంది. ఈ సినిమాలో స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా కైఫ్ ప్ర‌ధాన పాత్ర‌దారులుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి మ‌నిష్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.


అదేవిదంగా బ‌డే మియాన్ చోటే మియాన్ 2 సినిమా దాదాపు 300 కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్, టైగ‌ర్ శ్రాఫ్ న‌టిస్తున్నారు. అలీ అబ్బాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న సినిమా ప‌ఠాన్‌. ఈ సినిమా 250 కోట్ల భారీ బ‌డ్జెట్ తో రూపొందుతుంది. ఈ చిత్రంలో షారూఖ్ ఖాన్ పాటు స‌ల్మాన్ ఖాన్ కూడా క‌నిపించ‌నున్నారు. సిద్దార్థ ఆనంద్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భార‌తీయుడు 2 సినిమా 200 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రూపుదిద్దుకుంటున్న ఈ విష‌యం విధిత‌మే. క‌మ‌ల హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ర‌న‌బీర్ క‌పూర్ అయాన్ ముఖ‌ర్జీ కాంబోలో వ‌స్తున్న చిత్రం బ్ర‌హ్మాస్త్ర‌. రూ.300 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

Also Read : 

మీ జీవిత భాగ‌స్వామిని చేసుకునే ముందు ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి

రామ్ గోపాల్ వ‌ర్మ‌కు ఊహించ‌ని షాక్.. ల‌డ్కీ సినిమాపై కోర్టు స్టే..!

 

Visitors Are Also Reading