ఇప్పటి తరం వారికి అలనాటి స్టార్ హీరోయిన్ రజిని గురించి పెద్దగా తెలియకపోవచ్చు. ఆమె తన అందం, అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు కుర్రకారుకు నిద్రపట్టకుండా చేశారు. ఆమె ఇప్పుడున్న దిగ్గజ హీరోలలో చాలా మంది తో నటించింది. తెలుగు, హిందీలోనే లోనే కాకుండా కన్నడ,తమిళ ఇండస్ట్రీలో కూడా రజినీ నటించి మెప్పించారు. దాదాపుగా 200 కు పైగా సినిమాల్లో నటించిన రజిని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
రజిని సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే వీరి తల్లిదండ్రులు చూపించిన సంబంధాన్ని చేసుకుని సినిమాలకు స్వస్తి పలికింది. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా రజినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా తన నటనతో అందర్నీ ఆకట్టుకొని మంచి పేరు తెచ్చుకుంది. ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విషయాన్ని చెబితే అందరూ ఆశ్చర్యపోతారు. రజిని ఇంటి పక్కన ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ ను చూసేందుకు బయటకు వచ్చిన రజిని, ఆ దర్శకుడి కంట పడింది. దీంతో ఆమె వివరాలు తన సిబ్బందితో కనుక్కోమని చెప్పారు దర్శకుడు.
Advertisement
వివరాలు తెలుసుకొని తన తదుపరి సినిమాలో రజనీ ని ఎంపిక చేశారు డైరెక్టర్. ఈ రకంగా ముందు తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె,1985 బ్రహ్మముడి అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న రజిని వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. ఈ సమయంలోనే తల్లిదండ్రులు ఒక ఎన్నారై డాక్టర్ సంబంధం చూడగానే వారి మాటను తీసివేయ లేక వివాహం చేసుకొని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ముగ్గురు పిల్లలు పుట్టాక భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత ఇండియాలో బెంగళూరులో హ్యాపీ గా సెట్ అయినట్టు తెలుస్తోంది.
ALSO READ:
- అమితాబచ్చన్-బాలకృష్ణ కాంబోలో మల్టీస్టారర్ మూవీ వాయిదా పడడానికి అసలు కారణం అదేనా..?
- July 16th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!