బరువు పెరగడం, తగ్గడం అనేది మానవుని సహజ లక్షణం. అధిక బరువు పెరిగినా, అధికంగా బరువు తగ్గినా ప్రమాదమే. యావరేజ్‌గా ఉండడమే బెటర్. బరువు పెరుగుట అతిపెద్ద ప్రమాదమనే చెప్పవచ్చు. బరువు పెరగడం ద్వారా పొట్ట, నడుపుపై ఎఫెక్ట్ చూపించి ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ బాధితులు కావచ్చు. ముఖ్యంగా స్థూలకాయాన్ని నియంత్రించేందుకు గంటల తరబడి వర్కవుట్స్ చేస్తున్నా కానీ వారి ఊబకాయం మాత్రం అదుపులో ఉండడం లేదు. వారికి బెల్లి ఫ్యాట్ విపరీతంగా పెరుగుతుంది. ఇది పొత్తి కడుపులోని కండరాల కింద, కాలేయం, ప్రేగులు, కడుపు చుట్టూ నిలువ చేయబడిన కొవ్వు ఇలా పేరుకుపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే సరైన ఆహారం తీసుకోకపోవడం వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి వంటి పలు కారణాలుంటాయి. ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ పెరగడం, తగ్గడం వంటివి కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు. మీరు బరువు పెరిగినప్పుడు దాని కోసం డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Advertisement
ప్రధానంగా సీజనల్ వెజిటేబుల్స్ తినాలి. సీజనల్ ఏయే కూరగాయలు, ఏయే పండ్లు లభిస్తాయో వాటన్నింటిని తీసుకోవాలి. సీజనల్ వెజిటేబుల్స్, పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వెజిటేబుల్స్‌లో ఫైబర్, ఫ్రక్టోజ్ కలిగి ఉంటాయి. ముఖ్యంగా బచ్చలికూర, పాలకూర, కాలే ఆకులు , క్యాబేజి, వంటి కొన్ని కూరగాయాల్లో ఫైబర్ పుష్కలంగా ఉండడమే కాకుండా ఐరన్, కాల్షియం, విటమిన్ కే ఉంటాయి. ఇవి బెల్లి ఫ్యాట్ తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇక క్యారెట్, ముల్లంగి, బఠానీ , బీన్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. మిల్లెట్ తో తయారు చేసిన రొట్టెలను తినాలి.
ఇక భోజనం చేసిన తరువాత మధ్యలో చిరుతిండి అస్సలు తీసుకోకండి. అల్పాహారంలో పోషకాలు తీసుకోవడం వల్ల రోజంతా కడుపు నిండుగా ఉంటుంది. రోజులో అల్పాహారం కోసం ఏమి తినాలో ముందుకు ఓ ప్లాన్ చేసుకోవాలి. అల్పాహారంలో ప్రోటిన్, కొవ్వు, ఫైబర్ ఉన్న స్నాక్స్ తీసుకోవాలి. సాయంత్రం పూట బత్తాయి, వేరుశనగ, హెర్బల్ టీ తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసిన ఊరగాయలు, చట్నీ, పెరుగు వంటివి తీసుకోండి. వీటితో పాటు మీ శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం. ఉదయం వేళలో లేత ముదురు ఎండలో విటమిన్ డి లభిస్తుంది. బరువు తగ్గడానికి వ్యాయామం కూడా చాలా అవసరం. రోజు 15 నుంచి 30 నిమిషాల వరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
Also Read :
పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి, రామ్‌చరణ్..ఆ సినిమా కోసం ఏం చేశారంటే..?
2022 లో IMDB లిస్ట్‌లో టాప్ సినిమాలు ఏవేవి ఉన్నాయో మీకు తెలుసా..?