పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. పెళ్లి అంటే ఇద్దరి మనసులు కలవడంతో పాటూ రెండు కుటుంబాలు కూడా కలవడం అని గుర్తుంచుకోవాలి. అంతే కాకుండా పెళ్లి తరవాత కాపురంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అంటే అబ్బాయికి అతడి తల్లిదండ్రులు అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు మంచి చెడ్డలు ముందు జాగ్రత్తలు చెప్పాలి.
Also Read: అతడిని కలిసింది నిజమే కానీ…70ఏళ్ల వ్యాపారవేత్తతో రిలేషన్షిప్ పై గృహలక్ష్మి నటి క్లారిటీ..!
Advertisement
కాబట్టి అమ్మాయికి ఆమె తల్లి పెళ్లికి ముందే ఈ విషయాలు చెప్పాలని తద్వారా కాపురం సజావుగా సాగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎంత చదువుకున్నా కూడా అత్తామామలకు గౌరవం ఇవ్వాలని వారిని కూడా తల్లి దండ్రులుగా భావించాలని అమ్మాయి తల్లి పెళ్లికి ముందే కూతురుకు నేర్పించాలట.
Advertisement
సంసారం అన్న తరవాత గొడవలు కామన్…అయితే అలా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలని చెప్పాలట. కానీ భర్త అత్తమామలు అదే పనిగా ఇబ్బంది పెడితే మాత్రం తమకు సమాచారం ఇవ్వాలని మేం నీకు ఉన్నామనే భరోసా ఇవ్వాలని చెబుతున్నారు.
పెళ్లి తరవాత అందరితో కలిసిమెలిసి ఉండాలని అత్తకు పనిలో సాయం చేయడం లాంటివి చెప్పాలట. ఏ విషయానికి అయినా అవేశపడకుండా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పాలట. అంతే కాకుండా తమ కూతురును మరో ఇంటికి పంపేటప్పుడు ముందుగానే అక్కడి వాతావరణానికి అలవాటుపడేలా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు నడుచుకోవాలట.
ALSO READ :మీనకు షాక్ ఇచ్చిన భర్త.. ఆయన ఆస్తి ఎవరికి దక్కుతుందో తెలుసా..?