Home » అత‌డిని క‌లిసింది నిజ‌మే కానీ…70ఏళ్ల వ్యాపార‌వేత్త‌తో రిలేష‌న్షిప్ పై గృహ‌ల‌క్ష్మి నటి క్లారిటీ..!

అత‌డిని క‌లిసింది నిజ‌మే కానీ…70ఏళ్ల వ్యాపార‌వేత్త‌తో రిలేష‌న్షిప్ పై గృహ‌ల‌క్ష్మి నటి క్లారిటీ..!

by AJAY
Ad

ఒప్పుడు హీరోయిన్ గా న‌టించిన కస్తూరి శంక‌ర్ తెలుగు త‌మిళ ప్రేక్ష‌కులకు సుప‌రిచితురాలే. తెలుగులో నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన అన్న‌మ‌య్య సినిమాలో క‌స్తూరి శంక‌ర్ ర‌మ్య‌కృష్ణ‌కు సోద‌రి పాత్ర‌లో న‌టించారు. ఆ త‌ర‌వాత టాలీవుడ్ లో మ‌రికొన్ని సినిమాల‌లో హీరోయిన్ గా న‌టించారు. కానీ హీరోయిన్ గా క‌స్తూరి శంక‌ర్ పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు.

Advertisement

ఆ త‌ర‌వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం సినిమాలు సీరియ‌ల్స్ లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ప్ర‌స్తుతం తెలుగులో క‌స్తూరి శంక‌ర్ గృహ‌ల‌క్ష్మి అనే సీరియ‌ల్ లో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నారు. తెలుగులో ఈ సీరియ‌ల్ కు చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఓ వైపు సీరియ‌ల్స్ లో న‌టిస్తూ మ‌రోవైపు వెబ్ సిరీస్ ల‌లో సైతం న‌టిస్తున్నారు.

Advertisement

అయితే బోల్డ్ గా మాట్లాడ‌టం వ‌ల్ల క‌స్తూరి ఫేమ‌స్ చాలా పాపులారినీ సంపాదించుకుంటారు. అంతే కాకుండా గ్లామ‌ర్ షో విష‌యంలో కూడా త‌గ్గేదే లే అంటారు. ఇదిలా ఉంటే క‌స్తూరి శంక‌ర్ కు ఓ బ‌డా వ్యాపార‌వేత్త‌తో సంబంధం ఉంద‌ని అప్ప‌ట్లో మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. అంతే కాకుండా ఆ వ్యాపార‌వేత్త వ‌య‌సు 70 ఏళ్లు అంటూ వార్త‌లు వ‌చ్చాయి. కాగా తాజాగా ఈ విష‌యం పై క‌స్తూరీ ఓ ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

తాను ఓ ప‌నిమీద వ్యాపార‌వేత్తను క‌లిసిన విష‌యం నిజ‌మేన‌ని చెప్పారు. కానీ ఓ విష‌యం గురించి తాము క‌ల‌వ‌గానే ఇలాంటి వార్త‌లు రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. మీడియా వాళ్లు ఇలాంటి వార్త‌ల‌ను సృష్టించార‌ని తానంటే గిట్ట‌ని వాళ్లే ఆ ఆ వార్త‌ల‌ను స్ప్రెడ్ చేశార‌ని క‌స్తూరి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ అస‌లు ఆ వ్యాపారవేత్త ఎవ‌రు అన్న సంగ‌తి మాత్రం క‌స్తూరి శంక‌ర్ బ‌య‌ట‌పెట్ట‌లేదు.

Visitors Are Also Reading