యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సాధారణ స్టార్ హీరో లా ఉండేవారు. అలాంటి ఆయనను జక్కన్న పూర్తి గా మార్చేసారు. బాహుబలి సినిమా తో ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా చేశాడు. బాహుబలి సినిమా వరకు టాలీవుడ్ కు వంద కోట్ల సినిమా అంటే తెలియదు. ఆ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీని 100 కోట్ల సినిమా రేంజ్ కి చేర్చడమే కాకుండా ప్రభాస్ ని దేశవ్యాప్తంగా బాహుబలి ని చేశాడు. సినిమాకు ముందు ప్రభాస్ ,ఎన్టీఆర్,పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తర్వాత ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన రేంజ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. రాజమౌళి పుణ్యాన పాన్ ఇండియా లెవెల్ లో పేరు తెచ్చుకున్న ప్రభాస్ ఆ పేరును సాహో తో చేరిపేశాడు. సాహో సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఆశించిన ఫలితం రాకపోయినా సరే గ్రాస్ 150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫ్లాప్ టాక్ తో దేశ వ్యాప్తంగా 430 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.
Advertisement
వందల కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ వచ్చింది. బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్ అనుకున్నంత ఫలితాలు సాధించలేక పోయినా కానీ ప్రభాస్ పేరు మాత్రం తగ్గలేదు. దానికి కారణం ఏంటంటే ఆయన తీసుకుంటున్న పారితోషికం, ఆయన సైన్ చేస్తున్న చిత్రాలు. ప్రభాస్ ఇప్పటికే ఆయన చిత్రాలను ప్రకటించారు. ఇందులో మూడు నిర్మాణ దశలో ఉండగా రెండో సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఇందులో ఒకటి పౌరాణిక చిత్రం ఆదిపురుష్, ఇది 2023 సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరో సినిమా సలార్ ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తయింది. మరో మూవీ స్పిరిట్ వచ్చే ఏడాది మొదలు కానుంది. అలాగే దర్శకుడు మారుతితో చేస్తున్న మూవీ దసరా కి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇలా ఐదు ప్రాజెక్టులు ఒకే సంవత్సరంలో తీసుకుంటున్నా ప్రభాస్ రెమ్యూనరేషన్ ఆరు వందల కోట్ల పైమాటే..
Advertisement
అంటే ఆయన ఒక చిత్రానికి 120 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్నారన్నమాట. అంటే ఈ చిత్రాల నుండి ప్రభాస్ ఆరు వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్ హీరోల్లో కూడా ఎవరూ ఇంత పారితోషికం తీసుకోలేదు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇప్పటివరకు మహేష్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు 50 నుంచి 70 కోట్లు తీసుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ మరియు పుష్ప సినిమాల వరకు రామ్ చరణ్ మరియు, అల్లు అర్జున్ 30 కోట్లు తీసుకునేవారు అంటే ఈ లెక్కన బట్టి చూస్తే ప్రభాస్ ఐదు మూవీస్ కు తీసుకునే రెమ్యునరేషన్ వీళ్లు తీసుకోవాలంటే కనీసం పదేళ్లకు పైనే పడుతుంది. అంటే వీరు 12 సినిమాలకు పైగా చేస్తే గాని ఇంత అమౌంట్ తీసుకోలేరు.
also read: