ప్రముఖ నటి, నర్తకి భారతదేశంలోనే ప్రతిభావంతమైన నటులలో ఒకరు. భరతనాట్యంలో ఆమె దిట్ట. ప్రస్తుతం ఆమె ఎంతో మందికి ఈ నాట్యం నేర్పిస్తూ జీవనం గడుపుతుంది. అలాంటి శోభన చాలా సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.. మరి అలాంటి ఆమె వివాహం ఎందుకు చేసుకోలేదో ఒక ఇంటర్వ్యూలో విషయాన్ని తెలియజేసింది.. అది ఏంటో ఒక సారి చూద్దాం..? శోభన అసలు పేరు శోభన చంద్రకుమార్ పిల్లాయ్, బహుభాషా నటిగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ ఇలా అనేక ఇండస్ట్రీలో తన సత్తా చాటుకుంది. నటిగానే కాకుండా నర్తకిగా కూడా మంచి పేరు సంపాదించుకుంది. 51 సంవత్సరాల శోభన ఇప్పటికీ వివాహం చేసుకోలేదు.
Advertisement
అయితే పెళ్లి దూరంగా ఉండడానికి ప్రేమ వైఫల్యం అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఒక మలయాళ నటున్ని ప్రేమించిందని అంటుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరు దూరమయ్యారని అంటుంటారు. ఆ మలయాళ నటుడు తన కుటుంబానికి నచ్చినటువంటి అమ్మాయిని వివాహం చేసుకొని ఆనందంగా గడుపుతున్నారట, కానీ శోభన మాత్రం వివాహం చేసుకోకుండా ఉండిపోయిందని మలయాళీ పత్రిక లో వచ్చిన కథనం. చంద్రముఖి సినిమాకు ఆమె చేసిన గంగ పాత్రకు జాతీయ స్థాయిలో ఉత్తమ జాతీయ అవార్డు దక్కింది. 2006లో ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కేరళ లో పుట్టిన ఈ అమ్మడు తెలుగు చిత్ర సీమలో కూడా చాలా సినిమాలు చేసింది. పన్నెండేళ్ల వయసులో నటి భానుమతి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన భక్త ధ్రువ మార్కండేయ సినిమా లో నటించింది.
Advertisement
ఆ తర్వాత నాగార్జున మొదటి చిత్రం విక్రం లో శోభన కూడా హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయం అయింది. చిరంజీవి రుద్రవీణ లో కూడా చేశారు. బాలకృష్ణ తో మువ్వగోపాలుడు, నారి నారి నడుమ మురారి, వెంకటేష్ హీరోగా అజయుడు త్రిమూర్తులు మూవీస్ లో, మోహన్ బాబుతో అల్లుడుగారు, రౌడీగారి పెళ్ళాం సినిమాలో నటించి మెప్పించారు శోభన. ఇలా తెలుగు ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలతో నటించారు. దాదాపు రెండు వందల సినిమాల్లో నటించిన శోభన సినిమాలు తగ్గిస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ నేర్పిస్తూ దానికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో పెడుతున్నారు.
aslo read:
- “మనసంతా నువ్వే” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం చేస్తుందంటే..?
- తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు చేయకూడని ఈ 5 పనులు ఏంటో మీకు తెలుసా..?