Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 07.07.2022: మేషం

 

మీ కృషి ఫ‌లిస్తుంది. అధికారులు మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు కురిపిస్తారు. తోటివారి స‌హ‌కారంతో అనుకున్న ప‌నిని త్వ‌ర‌గా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు సంబంధించి కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu: వృషభం 

మాన‌సిక సౌఖ్యం క‌ల‌దు. కొన్ని కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. బందుమిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu: మిథునం

స‌త్ఫ‌లితాల‌ను అందుకుంటారు. కొన్ని విష‌యాల్లో మ‌తోనిబ్బ‌రం అవ‌స‌రం. కొన్ని సంద‌ర్భాల్లో అస్థిర బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు చేస్తారు. కీల‌క లావాదేవీల‌ను చేసే ముందు నిపుణుల‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం.

Today rashi phalau in telugu : కర్కాటకం

గొప్ప సంక‌ల్ప‌బ‌లంతో ముందుకు సాగి అనుకున్న‌ది సాధిస్తారు. మాన‌సికంగా ధృడంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. అధికారుల స‌హ‌కారం ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

ఉద్యోగంలో ఉన్న‌త ఫ‌లితాల‌ను అందుకుంటారు. భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. మాన‌సికంగా దృడంగా ఉంటారు. అధికారుల స‌హ‌కారం ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. ఓ వ్య‌వ‌హారంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. కొంద‌రి వ్య‌క్తుల ప్ర‌వ‌ర్త‌న లేదా సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : తుల

భోజ‌న సౌఖ్యం క‌ల‌దు. శ‌రీర సౌఖ్యం ఉంటుంది. సంద‌ర్భోచితంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. చెప్పుడు మాట‌ల‌ను వినకండి. ప్ర‌యాణాల్లో ఆటంకాలు ఉంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

క‌ష్టాన్ని న‌మ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఒక‌టి రెండు ఆటంకాలు ఎదురైనా పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌క‌పోవ‌చ్చు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu : ధనస్సు

అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ మీ రంగాల్లో విజ‌యావ‌కాశాలు మెరుగ‌వుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టి స‌త్ఫ‌లితాలు సాధిస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలుంటాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

చేప‌ట్టిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌వుతుంది. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాల‌తో ఇబ్బందులు ప‌డ‌తారు.

Today rashi phalau in telugu :  మీనం

మీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. త‌ర‌చూ నిర్ణ‌యాలు మారుస్తూ ఇబ్బందులు ప‌డ‌తారు. స్థిర‌మైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో స‌మ‌స్య‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

Visitors Are Also Reading