మన నిత్యజీవితంలో చాలా సందర్భాల్లో పలు రకాల జోకులు వింటుంటాం. స్నేహితుల మధ్యనో, లేక బంధువుల మధ్య ఇలా ఎవరో ఒకరు జోక్స్ వేస్తూనే ఉంటారు. ఇక ఎవరైనా జోక్స్ వేయగానే పగలబడి నవ్వుకుంటాం. అయితే ప్రపంచంలోనే అత్యంత హాస్యస్పదమైన జోక్ ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా..? ఈ ప్రపంచంలో ఎక్కువ మందికి నవ్వు తెప్పించే జోక్ ఏమిటబ్బా అని ఓ సైకాలజిస్ట్‌కు ఆలోచన వచ్చిందట. వెంటనే ఆయన ఓ ప్రయోగం చేసి దాని ద్వారా సమాధానం కనుగొన్నాడు. ప్రపంచంలో ఇంతకి ఎక్కువ మందికి నవ్వు తెప్పించే ఆ జోక్ ఏమిటో ఇప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా..? అలా అయితే ఇది చదివితే తెలుస్తోంది.
Advertisement
సైకాలజిస్ట్ డాక్టర్ రిచర్డ్ వైజ్‌మాన్ ప్రపంచంలో హాస్యస్పదమైన జోక్ ఏమిటో తెలుసుకోవడానికి ఓ ప్రయోగం చేశారు. ప్రయోగంలో భాగంగా ఓ వెబ్ సైట్‌లో తమకు నచ్చిన జోక్‌లను పంపాలని ప్రజలను ఆహ్వానించాడు. 2001లో నిర్వహించిన ఈ ప్రయోగం 40వేల కంటే ఎక్కువ జోకులు, దాదాపు రెండు మిలియన్ల రేటింగ్‌లను ఆకర్షించింది. అత్యధిక ప్రపంచ రేటింగ్‌లను పొందిన జోక్‌ను మాంచెస్టర్‌కు చెందిన మానసిక వైద్యుడు గుర్ఫాల్ గోసాల్ సమర్పించారు.
Advertisement
ఇద్దరూ వేటగాళ్లు అడవిలో ఉన్నప్పుడూ వారిలో ఒకరు కూలిపోయారు. అతను ఊపిరి పీల్చుకున్నట్టు లేదు. అతని కళ్లు చెమర్చాయి. అవతలి వ్యక్తి తన ఫోన్‌ని తీసి, ఎమర్జెన్సీ సర్వీసెస్‌కి కాల్ చేశాడు. నా స్నేహితుడు చనిపోయాడు. నేను ఏమి చేయగలను అని అడుగుతాడు. అప్పుడు ఆ ఆపరేటర్ ఇలా అంటాడు శాంతంగా ఉండండి, నేను సాయం చేయగలను. ముందుగా అతను చనిపోయాడు అని నిర్ధారించుకుందామని చెప్పాడు. ఇక ఆ తరువాత నిశ్చబ్దం, అప్పుడు ఒక షాట్ వినిపడుతోంది. ఆ తరువాత వ్యక్తి తిరిగి ఫోన్‌లో సరే ఇప్పుడు ఏమిటి అని అంటాడు. యూనివర్సల్ అప్పీల్ కారణంగా ఈ జోక్ టాప్‌లో నిలిచినట్టు సైకాలజిస్ట్ వైజ్‌మన్ చెప్పారు. ఇక సమర్పించిన పలు జోకులు నిర్దిష్ట వ్యక్తుల సమూహాల నుంచి అధిక రేటింగ్‌లను పొందాయి. ఈజోక్ నిజమైన విశ్వవ్యాప్త ఆకర్షణను కలిగి ఉందని చెప్పాడు.
Also Read :
పెళ్లి తరువాత సంతోషంగా ఉండకపోవడానికి అసలు కారణం చెప్పిన సమంత..!