మన దేశంలో ఎన్నో సాంప్రదాయాలు, ఆచారాలు ఉంటాయి. వాటిని ఎక్కువమంది పాటిస్తారు. అంతే కాకుండా విధి నిషేదాలు కూడా మన సాంప్రదాయంలో ఎక్కువగానే కనిపిస్తుంటాయి. ఎలాంటి సమయంలో ఏ పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాలను మన పూర్వీకులు పెద్దలకు చెప్పారు. వాళ్లు తమ తరువాత తరాలకు చెబుతున్నారు. ఇక స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయాలి. ఎలాంటి పనులకు దూరంగా ఉండాలి అనేది కూడా చెప్పారు. ఆ విషయాలు చాలా మందికి తెలుసు కూడా..కానీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్తలు కూడా కొన్నిపనులకు దూరంగా ఉండాలి.
Advertisement
ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కాబట్టి భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్తలు ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం…..భార్య గర్భవతి అయినప్పుడు ఆమె పాటించే నియమాలన్నీ భర్త కూడా పాటించాలట. పుట్టబోయే బిడ్డ ఇద్దరిలో సమానం కాబట్టి భార్య పాటించే నియమాలన్నీ పాటించాటలట. భార్యలకు ఏడవ నెల వచ్చిందంటే కొబ్బరి కాయలు కొట్టకూడదని చెబుతుంటారు. అయితే ఆ సమయం వచ్చినప్పుడు భర్తలు కూడా కొబ్బరి కాయలు కొట్టకూడదట.
Advertisement
Also Read: “ఛత్రపతి” రీమేక్ టైటిల్ కోసం మేకర్స్ తిప్పలు…!
అంతే కాకుండా ఏడవ నెల వచ్చిన తరవాత ఆలయాలకు వెళ్లకూడదని చెబుతుంటారు. అది కూడా భర్తలకు వర్తిస్తుందట. పీటల పై కూర్చుని చేసే పనులు కూడా చేయకూడదు అంట. అంతే కాకుండా భార్య గర్భవతిగా ఉన్న సమయంలో భర్తలు శవాలను మోయడం లాంటివి కూడా చేయకూడదట. మిగతా సమయంలో అలాంటివి చేయడంలో తప్పు లేదట. కానీ గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రం చేయకూడదట.
భార్య గర్భవతి కాబట్టి అలాంటి వాటికి పిలవకూడదు అని తెలియడానికే భర్తలు గడ్డం, హెయిర్ కట్ కూడా చేసుకోకుండా ఉండాలట. అదే విధంగా గడ్డం చేసుకునేటప్పుడు లేదా హెయిర్ కట్ చేసుకున్నప్పుడు గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి భార్య గర్భంతో ఉన్నప్పుడు హెయిర్ కట్ గడ్డం చేయించుకోకూడదట.
Also Read: విక్రమ్-2 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్…రోలెక్స్ విలన్ కాదట హీరో…?