Home » “ఛత్రపతి” రీమేక్ టైటిల్ కోసం మేకర్స్ తిప్పలు…!

“ఛత్రపతి” రీమేక్ టైటిల్ కోసం మేకర్స్ తిప్పలు…!

by AJAY
Published: Last Updated on
Ad

అల్లుడు శీను సినిమా తో టాలీవుడ్ కు పరిచయం అయిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. బడా నిర్మాత కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ హిట్ ఫ్లాట్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. అల్లుడు శ్రీను తో పాటు పలు చిత్రాలు విజయం సాధించడం తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక శ్రీనివాస్ ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా సూపర్ హిట్ అందుకున్న ఛత్రపతి రీమేక్ తో శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే చాలా కాలం గా ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. అసలు షూటింగ్ ఎక్కడ వరకూ పూర్తయ్యింది.

Advertisement

అసలు షూటింగ్ ఎక్కడ జరుగుతోంది అన్న విషయాలపై కూడా క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా అప్పట్లో ఈ సినిమా కోసం బాలీవుడ్ లో హీరోయిన్ దొరకడం లేదు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా పై మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం టైటిల్ ను వెతికే పనిలో చిత్రయూనిట్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఛత్రపతి…శివాజీ ఈ పేర్లకు దగ్గర గా ఉన్న టైటిల్స్ తో చాలా సినిమాలు ఉన్నాయట. దాంతో సినిమా టైటిల్ ను నిర్ణయించడానికి మేకర్స్ నానా తిప్పలు పడుతున్నట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading