నటసార్వభౌముడు ఎన్టీ రామారావు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కేవలం ఒకే తరహా సినిమాలలో కాకుండా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. సాంఘిక రాజకీయ, పౌరాణిక చిత్రాలతో ఎన్టీ రామారావు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్టీ రామారావు చేసిన విభిన్నమైన సినిమాల్లో యమ గోల సినిమా కూడా ఒకటి. 1977వ సంవత్సరంలో తాపీనేని రామారావు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది.
ఈ సినిమాను బెంగాలీలో తెరకెక్కిన యమాలయే మానుష్ అనే చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించారు. వెంకటరత్నం ఈ సినిమాను నిర్మించగా డివైన్ కామెడీ తో వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా లో ఎన్టీరామారావు హీరోగా నటించగా యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ నటించిన సంగతి తెలిసిందే. కానీ నిజానికి ముందుగా ఈ సినిమాలో బాలకృష్ణను హీరోగా అనుకున్నారు. అంతేకాకుండా కైకాల సత్యనారాయణ చేసిన పాత్రలో ఎన్టీ రామారావు నటించాల్సి ఉంది.
అయితే అప్పటికే ఎన్టీరామారావు యముడి పాత్రలో దేవాంతకుడు అనే సినిమా వచ్చింది. ఈ సినిమాకు పుల్లయ్య దర్శకత్వం వహించారు. దేవాంతకుడు సినిమాలో ఎన్టీఆర్ హీరోగా చేయడం వల్ల యమగోల కూడా అదే టైప్ సినిమా కాబట్టి బాలకృష్ణను హీరోగా పెట్టి తీయాలనుకున్నారు.
కానీ ఎన్టీఆర్ కు మాత్రం బాలకృష్ణ సొంత బ్యానర్ లో తప్ప ఇతర బ్యానర్ లలో సినిమాలు చేయడం ఇష్టం లేదు. ఆ ఒక్క కారణం వల్లే ఎన్టీఆర్ బాలకృష్ణ ను యమగోల ప్రాజెక్ట్ నుండి తప్పించారు. అంతే కాకుండా నటుడు కైకాల సత్యనారాయణను యముడి పాత్రలో తీసుకోవాలని కూడా ఎన్టీఆర్ గారే సూచించారు. ఇక అలా బాలకృష్ణ హీరోగా చేయాల్సిన యమగోల సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించి సూపర్ హిట్ అందుకున్నారు.
Also read : మహేష్ బాబు, రమేష్ బాబు లకు నందమూరి తారక రామారావు గారు చేసిన సహాయం గురించి తెలుసా ?