సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం.. ఈ రంగుల ప్రపంచంలో ఎంతోమంది సక్సెస్ అయిన వారు ఉన్నారు.. ఫెయిల్యూర్ అయిన వారు ఉన్నారు.. ఈ రంగుల ప్రపంచంలో కళామతల్లి దీవెనలు పొందాలంటే టాలెంట్ తో పాటుగా కాస్త అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. ఇండస్ట్రీలో ఎప్పుడు నటీనటులు వస్తూ ఉంటారు కొంతమంది పోతూ ఉంటారు.. టాలెంట్, ఆలోచన ఉంటే స్టార్ గా మారిన వారు ఉన్నారు.. కానీ కొంతమంది స్టార్డం వచ్చిన వెంటనే కథల విషయంలో కానీ ఇతరాత్ర కొన్ని విషయాలలో ఏమీ ఆలోచించకుండా సినిమాలు చేసి ప్లాప్ అయ్యి ఇండస్ట్రీకి దూరమైన వ్యక్తులు కూడా ఎంతోమంది. ఆ కోవకే చెందిన హీరో ఉదయ్ కిరణ్.. అప్పట్లో ఉదయ్ కిరణ్ సినిమాలు అంటే ఏ విధంగా ఫాలోయింగ్ ఉండేదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ముఖ్యంగా అమ్మాయిల నుంచి మాత్రం ఉదయ్ కిరణ్ కు భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉండేవారు. ఆ సమయంలో లవర్ బాయ్ గా ఒక ఊపు ఊపాడు ఉదయ్.
Advertisement
చిత్రం మూవీ తో మొదటిసారి ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్, మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి లవ్ చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఉదయ్ కిరణ్ ఆ సమయంలో స్టార్ హీరోలకు సైతం పోటీ ఇచ్చాడు. అలా పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ కెరీర్ కొద్ది రోజుల్లోనే మూడునాళ్ళ ముచ్చట గా మారిపోయింది. ఎంత ఫాస్టుగా పైకి ఎదిగారో, అంతే వేగంగా కిందకి పడిపోయాడు ఆయన.. ఈ విధంగా తన కెరియర్ చాలా డల్ అయిపోయిన తర్వాత మానసిక క్షోభ అనుభవించి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన కెరియర్ ఫ్లాప్ అవడానికి ప్రధాన కారణం అలాంటి సినిమాలు ఒప్పుకోవడమే అంటూ అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
Advertisement
ఆయన సినిమాలన్నీ లవ్ కి సంబంధించిన కథలతోనే రావడంతో చాలా మంది అభిమానులకు బోర్ కొట్టింది అని కొంతమంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అయితే అప్పట్లో ఉదయ్ కిరణ్ ఒక తప్పు కూడా చేశారు. జక్కన్న తెరకెక్కించిన సై మూవీ ఆ సమయంలో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ముందుగా ఉదయ్ కిరణ్ ని అడిగారట. కానీ ఉదయ్ కిరణ్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాజమౌళికి సమయం కావాలని అడగడం, దీంతో రాజమౌళి ఆయనతో కుదరక నితిన్ తో సినిమా కంప్లీట్ చేయడం సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం, నితిన్ కెరీర్ నే మార్చేసింది.. ఒకవేళ ఉదయ్ కిరణ్ ఈ సినిమా చేసి ఉంటే ఆయన ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదేమో అని కొంతమంది ఇండస్ట్రీ విశ్లేషకులు అంటుంటారు. ఏది ఏమైనా ఉదయ్ కిరణ్ లేని లోటు ఇండస్ట్రీకి తీరనిది అని చెప్పవచ్చు.
also read;
తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే..?
Chanakya Niti : మీరు సంతోషకరమైన జీవితం పొందాలంటే.. చాణక్యుడి రహస్యాలను పాటించండి..!