Home » హీరోగా “రవితేజ తమ్ముని కొడుకు”.. పూర్తి బాధ్యతలు ఆయనకేనా..!!

హీరోగా “రవితేజ తమ్ముని కొడుకు”.. పూర్తి బాధ్యతలు ఆయనకేనా..!!

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి తనదైన నటనతో స్టార్ డమ్ సంపాదించుకున్న హీరో మాస్ మహారాజా రవితేజ.. ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని హీరోగా తన కెరీర్ లో దూసుకుపోతున్నారు. హీరో మాస్ మహారాజా రవితేజ మూవీస్ థియేటర్లోకి వచ్చాయంటే ప్రతి ఒక్కరూ కడుపుబ్బ నవ్వుతూ ఎంజాయ్ చేయాల్సిందే. అలాంటి హీరో రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్ లో 2011లో “వీర” మూవీ వచ్చింది. కానీ ఈ మూవీ బాక్సాపీస్ వద్ద అంతగా వసూలు చేయలేదు.

Advertisement

ఈ మూవీ తర్వాత 8 సంవత్సరాల వరకు రమేష్ కి చెప్పుకోదగ్గ మూవీస్ ఏమీ రాలేదు. తర్వాత రీమేక్ మూవీతో రమేష్ వర్మ కాంబినేషన్ లో రవితేజ మళ్లీ స్క్రీన్ పైకి వచ్చారు. రవితేజతో 2021లో కిలాడీ సినిమా చేశారు. దీంతో రవితేజ ఖాతాలో మరొక ఫ్లాప్ వచ్చి పడింది. ఎక్కువ బడ్జెట్ తో తీసినా బాక్సాపీస్ వద్ద అనుకున్నంత వసూళ్లు మాత్రం చేయలేదు అని చెప్పవచ్చు. కట్ చేస్తే రవితేజ తమ్ముని కొడుకు మాధవణ్ ను ఇండస్ట్రీలోకి హీరోగా తీసుకురావాలని చాలా రోజుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Advertisement

ఈ తరుణంలో రమేష్ వర్మ మాధవన్ కాంబినేషన్లో హీరోగా సినిమా రాబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో రవితేజతో రెండు సినిమాలు చేసిన రమేష్ వర్మ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అయినా రవితేజ అతని టాలెంట్ ను చూసి తన తమ్ముడి కొడుకుతో ఎలాగైనా సినిమా తీసి హిట్ కోట్టించాలని చూస్తున్నారు. దీంతో రమేష్ వర్మ పై పూర్తి బాధ్యతలు పెట్టారని తెలుస్తోంది. కానీ దర్శకుడు ఎవరనేది ఇప్పటివరకు తెలియలేదు. మరి మాధవన్ అయినా హిట్ కొడతాడో లేదో అనేది మనం చూడాలి.

also read;

బొప్పాయి పండును ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌కుండా తినాలి.. ఎందుకో తెలుసా..?

లెజెండరీ న‌టుడు నాజ‌ర్ న‌ట‌న‌కు సెల‌వు.. కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading