Home » ఉదయ్ కిరణ్ హీరోగా మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఇన్ని ఉన్నాయా..?

ఉదయ్ కిరణ్ హీరోగా మధ్యలోనే ఆగిపోయిన సినిమాలు ఇన్ని ఉన్నాయా..?

by Sravanthi
Ad

తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఇందులో చాలా మంది హీరోలు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారే. ఇంతటి బ్యాక్గ్రౌండ్ వున్నా కొంతమంది హీరోలు మాత్రం అభిమానుల మనసును దోచుకో లేకపోతున్నారు. కానీ కొంతమంది హీరోలు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు.

Advertisement

ఈ కోవకే చెందిన అప్పటి హీరో ఉదయ్ కిరణ్. 20 సంవత్సరాల లోపు ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చి చిత్రం నువ్వు-నేను మనసంతా నువ్వే ఇలాంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టి ఎంతోమంది అమ్మాయిల గుండెల్లో గూడు కట్టుకున్నారు. ఈ సమయంలోనే మెగాస్టార్ ఇంటికి అల్లుడు పోతున్నారని చాలా మంది అనుకున్నారు. ఆయన స్టార్డం కూడా చాలా పెరిగిపోయింది. దీంతో ఉదయ్ కిరణ్ దగ్గరికి దాదాపుగా అరడజన్ సినిమాలు కూడా వచ్చాయి. కానీ అందులోనే చిరంజీవి కూతురుతో వివాహం రద్దు అవ్వడంతో ఇండస్ట్రీలో చాలా మంది ఆయనను దూరం పెట్టేసారు. సినిమాలు చేయడానికి దగ్గరకు రాలేదు.

దీంతో ఉదయ్ కిరణ్ ప్రకాష్రాజ్ సలహా మేరకు తమిళ లెజెండరీ డైరెక్టర్ ఏ బాలచందర్ చిత్రం “పోయ్” లో నటించారు. పోయ్ అంటే అబద్దం అని తెలుగులో అర్థం. ఈ సినిమా విజయవంతం అయితే ఉంటే ఉదయ్ కిరణ్ జీవితం మారిపోయేది. చిరంజీవి అల్లుడు అవుతున్నాడని తెలియగానే ఉదయ్కిరణ్ హీరోగా పెట్టి ప్రత్యూష బ్యానర్ పై రస్నా బేబీ అంకిత హీరోయిన్ గా ఒక మూవీ ప్రారంభం అయ్యింది. సౌందర్య మరణం తో బాలకృష్ణ ఉదయ్ కిరణ్ కి తన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న “నర్తనశాల” మూవీ లో అభిమన్యుని పాత్ర కూడా ఇచ్చాడు. కానీ ఈ మూవీ ఆగిపోయింది. తర్వాత క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఉదయ్ కిరణ్ ని మాస్ అండ్ యాక్షన్ హీరోగా చేయాలని, ఆయనచేత మిలటరీ ఆఫీసర్ గా దేశభక్తికీ సంబంధించి ఒక మూవీని చేయాలనుకున్నాడు.

Advertisement

ఈ మూవీని భారీ బడ్జెట్తో బ్రిటన్ అమెరికాలో షూటింగ్ చేశారు. ఇంకోవైపు సూపర్ గుడ్ ఫిలింస్ వంటి సంస్థ ఆర్.బి.చౌదరి ఎల్.వి.ప్రసాద్ వాకాడ అప్పారావు ఉదయ్ కిరణ్ మరియు సదా జంటగా లవర్స్ పేరుతో ద్విభాషా చిత్రాన్ని మొదలుపెట్టారు. సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రేమంటే సులువు కాదురా చిత్రాన్ని షూటింగ్ జరిగింది. ఇందులో మొదటిసారిగా ఉదయ్కిరణ్ ద్విపాత్రాభినయం చేశారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు అంజనా ప్రొడక్షన్ పై పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఒక మూవీ నిర్మించాడు. అలాగే సద్గురు ఆదిశంకరాచార్య ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం కూడా షూటింగ్ జరుపుకుంది. అలాగే ఉదయ్ కిరణ్ హీరోగా త్రిష హీరోయిన్ గా ఒక హిందీ సినిమాలు కూడా రీమేక్ చేశారు. ఇలా దేశభక్తి లవ్ స్టోరీస్, వంటి అనేక సినిమాలు షూటింగ్ జరుపుకొని విడుదల కాకుండా ఆగిపోయాయి.

Also read:

మోహన్ బాబు కి పిల్లనివ్వడానికి కుడా ఎందుకు వణికిపోయేవారు ? రెండవ వివాహం ఎందుకు చేసుకున్నారంటే ?

 భర్త చనిపోతే ఆస్థి భార్యకు రావాలంటే.. ఇది తప్పనిసరి ఉండాల్సిందే..?

Visitors Are Also Reading