Home » సీనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఏ మూవీకి ఎక్కువ పారితోషికం తీసుకున్నారో మీకు తెలుసా..?

సీనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఏ మూవీకి ఎక్కువ పారితోషికం తీసుకున్నారో మీకు తెలుసా..?

by Sravanthi
Published: Last Updated on
Ad

తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఒక రేంజ్ లో కొనసాగుతుంది అంటే దానికి కారణం సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఆయన నటనతోనే కాకుండా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అంతటి మహానటుడు తన సినీ జీవితంలో ఎన్నో సినిమాలు తీశారు. మరి ఆయన ఏ సినిమాకు ఎక్కువ పారితోషికం తీసుకున్నారో ఓ సారి చూద్దాం..?

Advertisement

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ తన సినీ జీవితంలో 300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. సాంఘిక, పౌరాణిక,జానపద ఇలా రకరకాల మూవీస్ చేశారు. అయితే ఆ రోజుల్లోనే తన కెరియర్ మొదట్లో 30 రోజుల కాల్షీట్ గాను ఆరు లక్షల రూపాయల పారితోషికం తీసుకునే వారు. అది ఆ సమయం లోనే అతి ఎక్కువ పారితోషికం.అయితే దీని తర్వాత అడవి రాముడు మూవీ కి 35 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారట ఎన్టీఆర్. దీన్ని చూసి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురయ్యారట. దీని తర్వాత అన్న ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్ ని పెంచుకుంటూ పోయారట. కానీ ఒక్కసారిగా హైప్ వచ్చిన చిత్రం మాత్రం అడవిరాముడు సినిమానే. దీని తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ సక్సెస్ అయి ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే ముఖ్యమంత్రి అవడానికి ముందు ఆయన మేజర్ చంద్రకాంత్ మూవీ ఒక రికార్డు క్రియేట్ చేసింది. చంద్రబాబు నాయుడు తోపాటుగా కొంతమంది టిడిపి నేతలు ఎన్టీఆర్ కు జనాల్లో ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి మూవీ చేయాలని కె.రాఘవేంద్రరావు చెప్పారట.ఈ మూవీను నిర్మించేందుకు మోహన్ బాబు స్వయంగా ముందుకు వచ్చారట. అలా ఆ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా అప్పట్లో ఏ విధంగా ఆడిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కొరకు అప్పట్లో ఎన్టీఆర్ మాత్రం కోటి రూపాయల పారితోషికం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ సమయంలో చిరంజీవి 65 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఈ విధంగా తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారిగా కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న హీరోగా ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేశారు. దీని తర్వాత రెండవ హీరోగా చిరంజీవి నిలిచారు.

ALSO READ;

ఆ స్టార్ హీరోయిన్‌తో SP బాలసుబ్ర‌హ్మ‌ణ్యం కుమారుడు చ‌ర‌ణ్‌

ఆ టైంలో పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడారంటూ.. నరేష్ పై పవిత్ర లోకేష్ కామెంట్స్ వైరల్..?

 

Visitors Are Also Reading