Home » గౌహ‌తిలోని ఆ హోట‌ల్‌లో మ‌హారాష్ట్ర ఎమ్మెల్యేల ఖ‌ర్చు ఎంతో తెలుసా..?

గౌహ‌తిలోని ఆ హోట‌ల్‌లో మ‌హారాష్ట్ర ఎమ్మెల్యేల ఖ‌ర్చు ఎంతో తెలుసా..?

by Anji
Ad

మ‌హారాష్ట్రలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న రాజకీయ సంక్షోభం ఎప్ప‌టికీ ముగుస్తుంద‌నే అంశంపై ఇంకా స్ప‌ష్ట‌త రావ‌డం లేదు. శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఏక్‌నాథ్ షిండే క్యాంపు రాజ‌కీయాల‌కు తెర‌లేపిన విష‌యం విధిత‌మే. మ‌హావికాస్ అఘాడీ ప్ర‌భుత్వం నుండి శివ‌సేన వైదొల‌గాల‌ని.. బీజేపీతో జ‌త క‌ట్టాల‌ని ఏక్‌నాథ్ షిండే డిమాండ్ చేస్తున్నారు. మ‌రొక వైపు గౌహ‌తిలో ఉన్న ఎమ్మెల్యేలంద‌రూ ముంబై వ‌చ్చి సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రెతో చ‌ర్చిస్తే ఎంవీఏ కూట‌మి నుంచి వైదొలిగే ఆలోచ‌న చేస్తాం అని శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ ప్ర‌క‌టించారు.


దాదాపు 42 మంది ఎమ్మెల్యేల కోసం ఏక్‌నాథ్ షిండే గౌహతిలోని రాడిస‌న్ బ్లూ ఫైవ్ స్టార్ హోట‌ల్ బుక్ చేసుకున్నారు. ఆ హోట‌ల్లో 196 గ‌దులు ఉన్నాయి. ఎమ్మెల్యేల కోసం వారం రోజుల‌కు 70 గ‌దుల‌ను బుక్ చేసిన‌ట్టు స్థానిక రాజ‌కీయ నాయ‌కులు పేర్కొంటున్నారు. తొలుత ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత గుజ‌రాత్‌లోని సూర‌త్ లో ఉన్న‌టువంటి ఓ హోట‌ల్‌లో బ‌స‌చేశారు. ఆ త‌రువాత అస్సాం రాజధాని గౌహ‌తికి మ‌కాం మార్చారు. అక్క‌డ రాడిస‌న్ బ్లూ హోట‌ల్‌లో 70 గ‌దుల‌కు 7 రోజుల‌కు రూ.56ల‌క్షలు చెల్లించాల్సి వ‌స్తుందంటే ఒక్క‌రోజు గ‌దికి, ఆహారం, ఇత‌ర అవ‌స‌రాల‌కు అయ్యే ఖ‌ర్చు రూ.8ల‌క్ష‌లు. ఇక ఆ హోట‌ల్‌లో బాంక్వేట్ హాల్ ను కూడా మూసేసింది. హోట‌ల్‌లో బ‌స చేసే వారికి మిన‌హాయింపు ఇచ్చి రెస్టారెంట్ ను కూడా మూసివేశారు.

Advertisement

Advertisement


ఇవే కాకుండా మొత్తం ఆప‌రేష‌న్‌లో చార్ట‌ర్డ్ ఫ్లైట్‌లు, ఇత‌ర ర‌వాణా ఖ‌ర్చుల సంగ‌తి ఏమిట‌నేది కూడా తెలియ‌దు. అంతేకాకుండా హోట‌ల్ ల ఉంటున్న ఎమ్మెల్యేల ఖ‌ర్చు రోజు రోజుకు పెరిగిపోతుంది. వీట‌న్నింటిని ఎవరూ చెల్లిస్తార‌నేది కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అస్సాంలో బీజేపీ ప్ర‌భుత్వ‌మే ఉంది కాబ‌ట్టి రాడిస‌న్ ద‌గ్గ‌ర అసాం బీజేపీ మంత్రులే ప‌హారా కాస్తున్నారు. క్యాంపు ఖ‌ర్చు అంతా క‌మ‌లం ఖాతాలోనే ప‌డే అవ‌కాశాలు లేక‌పోలేదు. గౌహ‌తిలోని రాడిస‌న్ బ్లూ హోట‌ల్‌లో వ‌ద్ద పోలీసులు భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేసారు.


ఇదిలా ఉండ‌గా.. గౌహ‌తి హోట‌ల్ నుంచి తాజాగా విడుద‌ల చేసిన వీడియో ప్ర‌కారం.. ఏక్‌నాథ్ షిండే వ‌ర్గంలో ప్ర‌స్తుతం 42 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 35 మంది శివ‌సేన‌, 7గురు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలున్నారు. మ‌రొక‌వైపు ఉద్ద‌వ్ ఠాక్రే త‌న నివాసంలో పార్టీ ఎమ్మెల్యేల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఆదిత్య ఠాక్రే స‌హా 13 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే హాజ‌రయ్యారు. మ‌హావికాస్ అఘాడి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్య‌మైన శివ‌సేన పార్టీలో చీలిక దాదాపు ఖాయ‌మైన‌ట్టు క‌నిపిస్తోంది.

Also Read : 

37 ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ పుస్త‌కాలు చేత‌బ‌ట్టి.. ఆ ప‌రీక్ష‌లో ఉత్తీర్ణ‌త

 

Visitors Are Also Reading