Home » మీరు 10 సెక‌న్లు ఒంటికాలు మీద నిల‌బడ‌లేరా..? అయితే ఈ జాగ్ర‌త్త ప‌డండి

మీరు 10 సెక‌న్లు ఒంటికాలు మీద నిల‌బడ‌లేరా..? అయితే ఈ జాగ్ర‌త్త ప‌డండి

by Anji
Ad

క‌నీసం 10 సెక‌న్ల పాటు ఒంటి కాలు మీద నిల‌బ‌డ‌లేని వ్య‌క్తులు 50ఏళ్లు పైబ‌డిన వారు అనారోగ్యం పాల‌యిన‌ట్టేన‌ని తాజాగా ఓ అధ్య‌య‌నంలో వెల్ల‌డి అయింది. 2009 నుంచి 1,702 మందిపై బ్రెజిల్‌లోని ఓ సంస్థ చేసిన అధ్య‌య‌నం బ్రిటిష్ జ‌ర్న‌ల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్ర‌చురిత‌మైన‌ది. ఈ ప‌రీక్ష‌లో ఒక కాలు భూమి ఉంచి రెండ‌వ కాలును ఒక అడుగు పైకి లేపాలి. భూమి మీద ఉన్న కాలు వెనుక రెండ‌వ కాలును పెట్టాలి. ఈ ప‌రీక్ష‌లో ఒక్కొక్కరికీ మూడు సార్లు అవ‌కాశం క‌ల్పిస్తారు. ఒక్క‌సారైనా పాస్ అవ్వాలి. ఈ ప‌రీక్ష‌లో ప్ర‌తి ఐదుగురిలో ఒక‌రు విఫ‌ల‌మ‌వుతున్నారు.


కేవ‌లం 10 సెక‌న్ల పాటు ఒక కాలు మీద నిల‌బ‌డ‌లేని మ‌ధ్య వ‌య‌స్కులు ఒక ద‌శాబ్దంలో మ‌ర‌ణించే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంద‌ని ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఫెయిల్ అయిన వారికి ఇది వ‌ర్తిస్తుంది. దాదాపు 84 శాతం మంది మ‌ర‌ణించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని తేలింది. ముఖ్యంగా బ్రెజిల్‌, ఫిన్లాండ్‌, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా దేశాల్లో వృద్ధుల కోసం చేసే సాధార‌ణ ఫిట్నెస్ టెస్ట్‌ల‌కు బ్యాలెన్సింగ్ ప‌రీక్ష‌ను జోడించ‌డంతో వైద్యుల‌కు కావాల్సిన ఆరోగ్య స‌మాచారం అందుతుంద‌ని ప‌రిశోధ‌కులు పేర్కొంటున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా నిల్చునే సామ‌ర్థ్యం లేకుండా 6,80,000 క‌న్న ఎక్కువ మంది మ‌ర‌ణిస్తున్నార‌ని వెల్ల‌డించారు.10 సెక‌న్ల పాటు ప‌రీక్ష ద్వారా అలాంటి ఇబ్బందులు ఉన్న‌వారెవ్వ‌రో తెలుసుకోవ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు పేర్కొంటున్నారు.

Advertisement

Advertisement

ఇక ప‌రీక్ష విష‌యానికొస్తే.. ఇది చాలా సుర‌క్షిత‌మైన‌ది. కేవ‌లం ఒక‌టి లేదా రెండు నిమిషాల్లోనే పూర్త‌వుతుంది. ఇది రోగుల ఆరోగ్య ప‌రిస్థితి వైద్యుల‌కు తెలియ‌జేస్తుందని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. ఫిటినెస్ టెస్ట్‌లో స‌ఫ‌ల‌మైన వారితో పోల్చితే విఫ‌ల‌మైన వారి మ‌ర‌ణ‌శాతం చాలా ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని వెల్ల‌డించారు. ఫిట్‌నెస్ టెస్ట్‌లో ఫెయిల్ అయిన వారు 17.5 శాతం మ‌ర‌ణించ‌గా.. పాస్ అయిన వారు 4.5 శాతం మ‌ర‌ణించార‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం ఒంటికాలు మీద నిల‌బ‌డే ప‌రీక్ష సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు పెడుతుంది.

Visitors Are Also Reading