ఒకపప్పుడు మా ఎలక్షన్స్ అంటూ ఇండస్ట్రీ వారికి తప్ప మూడోకంటికి తెలిసేవి కావు. కానీ గత ఏడాది నుండి మా ఎన్నికలంటే ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. దానికి కారణం మా ఎన్నికల్లో నెలకొన్న వివాదాలే. ఇక ఈ యేడాది అయితే ఏకంగా రిగ్గింగ్ లు…బెదిరింపులు అంటూ మా ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి. అంతే కాదు మా ఎన్నికలకు నెల రోజుల ముందునుండే పోటీలో ఉన్న సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శాస్త్రాలు కురిపించుకున్నారు. ఇక ఇటీవల జరిగిన మా ఎన్నికల్లో మొత్తానికి మంచు విష్ణు గెలిచినా ఆ తరవాత అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసకున్నాయి.
ఇప్పటికీ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఇదిలా ఉండగా మా ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు ప్రకటించి ఆ తరవాత నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్న సీవీఎల్ నరసింహారావు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సీవీఎల్ మా ఎన్నికల్లో తెలంగాణ వాదంతో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..చిత్రపూరి కాలనీలో జరిగిన అనేక అన్యాయాలు అక్రమాల గురించి మాట్లాడారు.
Advertisement
Advertisement
అదే విధంగా పద్మాలయ లాంటి అనేక స్టూడియోస్ లలో తెలంగాణకు కూడా వాటా ఉందంటూ ఆసక్తికర వ్యాక్యలు చేశారు. అంతే కాకుండా దాని గురించి ప్రశ్నించినందుకే మాలో సభ్యురాలిగా ఉన్న విజయశాంతి సభ్యత్వాన్ని తొలగించారని సీవీఎస్ సంచలన నిజాన్ని భయటపెట్టాడు. ప్రస్తుతం విజయశాంతి మాలో సభ్యురాలు కాదని ఆమెను తొక్కేశారు అంటూ సీవీఎల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే తెలంగాణ వాదానికి సపోర్ట్ చేసిందనే విజయశాంతిని బ్యాన్ చేశారని సీవీఎల్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: తరుణ్ తో ఆర్తీ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఎవరో తెలుసా..?