Home » స్వ‌చ్ఛ భార‌త్‌లో చెత్త తీసిన ప్రధాని.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌..!

స్వ‌చ్ఛ భార‌త్‌లో చెత్త తీసిన ప్రధాని.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌..!

by Anji
Ad

దేశంలో అన్ని న‌గ‌రాల‌ను చెత్త ర‌హితంగా మార్చ‌డ‌మే భార‌త ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌రొక‌సారి చెప్ప‌క‌నే చెప్పారు. స్వ‌చ్ఛ‌భార‌త్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని ప్ర‌గ‌తి మైదాన్ ఇంటిగ్రేడెడ్ ట్రాన్సిట్ కారిడార్‌లో భాగంగా ప్రారంభించిన భూగ‌ర్బ సొరంగంలో చెత్త‌ను సేక‌రించారు.


దానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఓ మీడియా సంస్థ ట్వీట్ ప్ర‌కారం.. ప్ర‌ధాని మోడీ కొత్త‌గా ప్రారంభించిన ప్ర‌ధాన సొరంగం అంత‌టిని ప‌రిశీలిస్తూ.. అక్క‌డ ప‌డి ఉన్న ఖాళీ వాట‌ర్ బాటిల్‌, చెత్త ప‌దార్థాల‌ను సేక‌రిస్తున్న‌ట్టు ఈ వీడియోలో మీరు చూడ‌వ‌చ్చు.

Advertisement

 

ప్ర‌గ‌తి మైదాన్ పున‌రాభివృద్ధిలో భాగంగా ఇంటిగ్రేటేడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముఖ్య‌మైన ట‌న్నెల్‌, 5 అండ‌ర్ పాస్‌ల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇవాళ‌ ప్రారంభించారు. 1.6 కిలోమీట‌ర్ల పొడ‌వైన ఈ సొరంగం గుండా తూర్పు ఢిల్లీ, నోయిడా, ఘ‌జియాబాద్ నుండి ఇండియా గేట్‌, సెంట్ర‌ల్ ఢిల్లీ ప్రాంతాల‌కు ప్ర‌జ‌లు సుల‌భంగా ప్ర‌యాణించ‌వ‌చ్చు. అంతేకాదు.. దీంతో ఇక‌పై ఐటీఓ మ‌థుర రోడ్‌, బైరాన్ మార్గాల వ‌ద్ద ట్రాఫిక్ క‌ష్టాల‌కు స్వ‌స్తీ పలికిన‌ట్టేన‌ని చెప్పొచ్చు. ఈ కారిడార్ ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్ర‌భుత్వం రూ.920 కోట్ల వ్యయంతో నిర్మించింది.

Visitors Are Also Reading