ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. ఎంతో సంపాదిస్తున్నారు. కానీ ఆ ముద్దుగుమ్మలు 30 సంవత్సరాలు దాటిన పెళ్లి పై మాత్రం మనసు పెట్టడం లేదు. పూర్వకాలం నుంచి ఒక సామెత ఉంది ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని.. ఈ స్టార్ హీరోయిన్ లకు ఇది అస్సలు సూట్ అవ్వడం లేదు. ఇప్పటికే 30 సంవత్సరాలు దాటి మధ్యవయసు వస్తున్నా పెళ్లి పై ఆలోచన లేకుండా పోతున్న ఆ స్టార్ హీరోయిన్ లు ఎవరో ఒకసారి చూద్దాం..?
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన ఘట్టం. దీన్ని మనం వయసులో ఉన్నప్పుడు అనుభవిస్తేనే చాలా బాగుంటుంది. వయసు దాటితే కొన్ని సమస్యలకు దారి తీయవచ్చు. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోయిన్లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియక ఫ్యాన్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మూడు పదుల వయసు దాటినా స్టార్ హీరోయిన్ల లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆమె పెళ్ళికి సంబంధించి శుభవార్త మాత్రం చెప్పడం లేదు. తమన్నా స్నేహితురాలు కాజల్ అగర్వాల్ రెండేళ్ల కింద పెళ్లి చేసుకొని ప్రస్తుతం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
Advertisement
Advertisement
మరొక స్టార్ హీరోయిన్ అనుష్క. అసలు పెళ్ళి విషయమే తీసుకు రావడం లేదు. శృతి హాసన్ మరియు త్రిష వీరు కూడా వారి వివాహం పై అస్సలు క్లారిటీ ఇవ్వడం లేదు. అలాగే ఛార్మి కౌర్,లావణ్య త్రిపాఠి మరియు నిత్యామీనన్,రకుల్ ప్రీత్ సింగ్ వివాహానికి మూడు అడుగుల దూరంలో ఉంటున్నారు. మరికొందరు సెలబ్రిటీలు తాము ప్రేమలో ఉన్నామంటున్నారు.కానీ ఆ విషయాలను బయట వెల్లడించడం లేదు. మరి ఈ ముద్దు గుమ్మలు ఈ సంవత్సరం అయిన వారి పెళ్లి విషయం పై క్లారిటీ ఇస్తారో లేదో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ALSO READ;
తెలుగు యాంకర్స్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా..అందరికంటే ఎక్కవ ఎవరికంటే..?
ఆమెతో లవ్ తీవ్రంగా దెబ్బతీసింది.. అందుకే పెళ్లికి దూరమయ్యాను అంటున్న అడివి శేష్..!