Home » ఆమెతో లవ్ తీవ్రంగా దెబ్బతీసింది.. అందుకే పెళ్లికి దూరమయ్యాను అంటున్న అడివి శేష్..!

ఆమెతో లవ్ తీవ్రంగా దెబ్బతీసింది.. అందుకే పెళ్లికి దూరమయ్యాను అంటున్న అడివి శేష్..!

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

ఇండస్ట్రీలో నటీనటుల్లో ఎవరికైనా సరే ఒక హిట్ వస్తే చాలు వారి గురించి వార్తలు కోకొల్లలుగా వస్తాయి. చిన్న చిన్న పాత్రలతో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన ఈ హీరో తాజాగా రిలీజ్ అయిన మేజర్ సినిమా తో బంపర్ హిట్ అందుకున్నారు హీరో అడివి శేష్. ఎన్నో ఏళ్ళ క్రితమే ఆయన నటుడిగా ప్రయాణం ప్రారంభించి వచ్చిన అవకాశాలను ఉపయోగించు కుంటూ ముందుకు సాగాడు. ఈ సందర్భంలోనే కథ మరియు కథనాలపై పట్టు సాధించాడు అడివి శేష్. మనం ఎంచుకునే కథ ఎలా ఉండాలి. అది మన బాడీ లాంగ్వేజ్ కు సరిపోతుందా లేదా అనేది పూర్తి క్లారిటీ వచ్చాకే ఆయన ఓకే చెబుతారు. ఇప్పటికే అడివి శేష్ ఖాతాలో గూడచారి, ఎవరు, తాజాగా మేజర్ సినిమా వంటి హిట్లు ఉన్నాయి.

Advertisement

ఆయన ఏ సినిమాలో చేసినా విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకుంటూ అభిమానులను కూడా పెంచుకున్నారు. తాజాగా అడివి శేష్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే కార్యక్రమంలో పాల్గొని రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.. మన తెలుగు హీరో హిందీలో కూడా విజయవంతం అయ్యాడని మేజర్ సినిమా గురించి చెప్పుకుంటూ ఉంటే సంతోషంగా ఉందన్నారు. నేను పూర్తిగా ఫారిన్ లో పెరగడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడే స్టయిల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చాక అందరూ సహకరించరని పూర్తిగా మార్చుకున్నాను. ఫారిన్ లో పెరిగిన నేను ఇలాంటి విషయాల జోలికి కూడా పోలేదు. మం* ,సి**ట్ లాంటివి ఇంతవరకు టచ్ చేయలేదు. నాకు వద్దు అని అనుకుంటే ఆ వైపు కూడా కనీసం చూడను.

Advertisement

ఎందుకంటే ఏదైనా అలవాటు అయితే మాత్రం దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. దేనిపైనైనా ఫోకస్ పెడితే మాత్రం సాధించేదాకా వదలను. ఈ సందర్భంగా ఆర్కే ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని అడిగితే ఆచార్య కరమైన విషయాన్ని బయటపెట్టారు శేష్.ఆయన అమెరికాలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించానని అన్నాడు. నా బర్త్ డే రోజునే అమ్మాయి పెళ్లయిందని ఆ ఎఫెక్ట్ నన్ను చాలా బాధించిందని తెలియజేశారు. లవ్ లో దెబ్బ తినడం వల్ల వివాహంపై పెద్దగా దృష్టి పెట్టలేక పోతున్నానని అన్నారు. మా ఇంట్లో ఇప్పటికే నాకు సంబంధాలు చూడటం మొదలు పెట్టారు అని చెప్పుకొచ్చారు.

ALSO READ;

తమ పిల్లల్లకి పెళ్లి చేసేముందు తల్లి దండ్రులు తప్పక తెలుసుకోవలసిన 5 విషయాలు..!

అదుర్స్ అనిపించిన అవేశ్‌ఖాన్‌.. నాలుగో టీ-20లో భార‌త్ ఘ‌న‌విజ‌యం

 

Visitors Are Also Reading