ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ భయబ్రాంతులకు గురి చేసిన ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఎయిడ్స్ నివారణకు మందు వచ్చేసింది. గత 40 సంవత్సరాల నుండి ప్రపంచ దేశాలను కలవర పెడుతున్న హెచ్ఐవీ కి మాత్రం వైద్యశాస్త్రం సరైన వ్యాక్సిన్‌ను తీసుకురాలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం ఈ వ్యాధికి కారణం అయిన వైరస్ క్షణానికి ఒకసారి రూపాంతరం చెందుతుండడమే. ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా శరీరంలోకి కనుక ప్రవేశిస్తే నిర్ణీత కణజాలాన్ని కేంద్రంగా చేసుకుని కీలక అవయవాలపై కూడా ప్రభావం చూపుతుంది.
ఎయిడ్స్ వ్యాధికి కారణం అయ్యే హెచ్ఐవీ కూడా నిర్ణీత కణజాలాన్ని కేంద్రంగా చేసుకునే పనిని ప్రారంభిస్తుంది. ఇక ఎప్పుడైతే వ్యాధి నిరోధక కణాలు క్రియాశీలకంగా మారి వైరస్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయో అప్పుడే హెచ్ఐవీ వైరస్ తన రూపాన్ని మార్చుకుంటుంది. దీంతో ఇమ్యూన్ సిస్టమ్ ఆ వైరస్‌ను కట్టడి చేయలేకపోతుంది. అదేవిధంగా మిగతా వ్యాదుల విషయంలో కూడా ఇలాగే జరగడం లేదు. అందుకోసమే హెచ్ఐవీ వ్యాధికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదా ఔషదం తీసుకురాలేకపోయారు.
Advertisement
Advertisement
హెచ్ఐవీ వైరస్‌ను నియంత్రించడానికి తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి బీ సెల్స్ బాగా సహాయపడుతాయని గుర్తించిన ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ అనే టెక్నాలజీ సహాయంతో వాటిని ఉత్తేజితం చేసారు. ఈ వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ పని చేయడం ప్రారంభించినది. ఇమ్యూన్‌సిస్టమ్ యాక్టివేట్ అయిన వెంటనే ఆ తరువాత దాని నుంచి తప్పించుకోవడానికి హెచ్ఐవీ వైరస్ ఒకటి కన్న ఎక్కువ గ్రూప్‌లుగా విడిపోయి అది రూపాంతరం చెందడానికి ప్రయత్నించింది. ఇక దీనిని ముందస్తుగానే ఊహించిన పరిశోధకులు రూపాంతరం చెందిన హెచ్ఐవీ వైరస్ గ్రూపులపై కూడా బీ సెల్స్ దాడి చేసేవిధంగా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ వైరస్ జన్యుక్రమం అదేవిధంగా రూపాంతరాలను ఎప్పటికప్పుడు పసిగట్టే సర్జ్ ఇంజన్‌గా క్రిస్పర్ సాంకేతికతను వినియోగించుకున్నారు.
Also Read :
విరాటపర్వం సినిమా చూడడానికి 10 కారణాలు.. అవి ఏమిటంటే..?