భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకి,శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు,పేడ, మూత్రం ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి దినచర్యను ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావిస్తుంటారు. గోవు సకలదేవతా స్వరూపం. ప్రాచీన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక గోమాత. పసిపాప ఆకలి తీర్చడం నుంచి పరమ శివుడికి అభిషేకం చేయడం వరకు గోవు యొక్క పాలు చాలా శ్రేష్టమైనవి. గోవు యొక్క పాలు,పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ మొదలగు వాటిని పంచగవ్యములు అంటారు. ఆవు తన జీవిత కాలంలో 4 లక్షల 10 వేల 4వందల మందికి ఒక పూట భోజనం ఇస్తుందట. అలాంటి గోవు కి అన్నం పెట్టే అవకాశం కలగడమే గొప్ప విషయంగా భావించాలి. గోవుకి ఆహారం సమర్పించినట్లయితే 33 కోట్ల మంది దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే అవుతుంది. వివాహమైన తర్వాత ఏ జంట అయిన కలగనున్న సంతానం గురించి కలలు కంటారు. సంతానం కలిగే విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా కలత చెందుతారు.భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు, వ్రతాలు చేస్తుంటారు. తమ కోరికలు నెరవేర్చమంటూ గుళ్ళు,గోపురాలు తిరుగుతారు. ఇలా సంతానం కోసం తపించే వాళ్ళు ప్రతి రోజు వాళ్ళు భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకు పెట్టాలని చెప్పబడుతోంది. గోమాతకు అన్నం పెట్టడం వల్ల సంతానభాగ్యం కలుగుతుందని పంచాంగ నిపుణులు అంటున్నారు.
Advertisement
ALSO READ;
Advertisement
తీవ్ర ఒత్తిడిలో చిరు..! ఎన్నో ఒడిదుడుకులు దాటి వచ్చిన చిరుకి పాపం..!
అక్కినేని అమల తల్లిదండ్రులు ఏ దేశానికి చెందినవారో మీకు తెలుసా..?