Home » తీవ్ర ఒత్తిడిలో చిరు..! ఎన్నో ఒడిదుడుకులు దాటి వచ్చిన చిరుకి పాపం..!

తీవ్ర ఒత్తిడిలో చిరు..! ఎన్నో ఒడిదుడుకులు దాటి వచ్చిన చిరుకి పాపం..!

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గౌరవంతో,స్టార్ హోదా లో కొనసాగుతున్న హీరో ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి మాత్రమే.. ఆయన ఎన్నో సినిమాలు తీసి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతటి స్టార్ డమ్ సంపాదించుకున్న మెగాస్టార్ కు ప్రస్తుతం లక్కు కలిసి రావడం లేదు.. ఖైదీ నెంబర్ 150 మూవీ తో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ఆ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ వచ్చిన చిరూ గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు అని అందరూ భావించారు. ఈ తరుణంలోనే సైరా నర్సింహారెడ్డి హిస్టారికల్ మూవీ తో మన ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో నడిచింది.

దీని తర్వాత వచ్చిన ఆచార్య మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా విఫలమైంది. అయినా చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే రాబోయే సినిమాల్లో చిరుకు హిట్టు ఇవ్వబోయేది ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ చివరి దశకు చేరుకుంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ కూడా నటించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఏది ఏమైనా సినిమా విడుదల అయితే గాని చెప్పలేం.

 

ఇకపోతే మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీలో మెగాస్టార్ కు చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అయితే ఈ మెహర్ రమేష్ కు ఇప్పటి వరకు ఇండస్ట్రీలో హిట్ టాక్ రాలేదు. అయినా చిరంజీవి అవకాశం ఇచ్చాడు. మరి ఈ మూవీతో నైనా మెహర్ రమేష్ హిట్ కొడతాడా లేదా అనేది ఆసక్తికరంగా మారుతోంది. మరొక యువ డైరెక్టర్ బాబీతో కూడా ఒక మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పేరు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ కూడా పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో మాస్ లుక్ లో మెగా అభిమానులకు కనిపించబోతున్నారు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విధంగా వరుసగా మూడు సినిమాలతో మెగాస్టార్ కు హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరు అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

also read;

అదిరే అభికి షూటింగ్‌లో ప్ర‌మాదం.. అస‌లు ఏమి జ‌రిగిందంటే..?

నేనూ..యల్లారీశ్వరి..విజయలచ్మి, జోతిలచ్మి, జైమాల్నిపాటలు గుర్తున్నాయా.. ఓ లుక్కేయండి..?

 

Visitors Are Also Reading