పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తే చాలు అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటి పవర్‌స్టార్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..?
ఆ రోజు పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా రిలీజ్. ఏ థియేటర్లో చూసినా ఇసుక రాలనంత జనం.. లౌడ్ స్పీకర్ల సందోహం.. ఎక్కడ చూసినా యువ అభిమానులు ఎవరికి వారే అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందులో ఒక అభిమాని పాలాభిషేకం చేస్తున్నాడు. అతని పేరే హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ కి ఎనలేని అభిమాని. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ తో ఒక ఫోటో ఆటోగ్రాఫ్ తీసుకోవాలనేది అతని ఆలోచన. మరి ఆయన కల నెరవేరిందా.. అనేది చూద్దాం..? సినిమాల మీద పిచ్చి తో హరీష్ శంకర్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా తర్వాత డైరెక్టర్ గా మారిపోయాడు. షాక్ సినిమా తో షాక్ తిన్నాడు. రవితేజ లాంటి స్టార్ హీరోతో డిజాస్టర్ సినిమా తీశాడు. ఆయన ప్లేస్ లో ఇంకే డైరెక్టర్ ఉన్నా అన్ని సర్దుకుని ఇండస్ట్రీని వదిలి వెళ్లే వాడు. కానీ హరీష్ శంకర్ మాత్రం మొండి అని చెప్పవచ్చు. మనం ఎక్కడ అయిపోయాము అక్కడే పని వెతుక్కోవాలని కసితో ముందుకు వెళ్ళాడు. రవితేజ కూడా హరీష్‌శంకర్ అంటే చాలా అభిమానం.ఫ్లాప్ ఇచ్చాడు. కానీ హరీష్ శంకర్ ను మాత్రం నమ్మేవాడు రవితేజ. హరీష్ శంకర్ కూడా ప్రతిరోజు రవితేజను కలుస్తూనే ఉన్నాడు. రవితేజ కోసం ఒక కథ కూడా రెడీ చేసాడు. కానీ ఆ తర్వాత ఆంజనేయులు షూటింగ్ స్పాట్ కు వెళితే నిర్మాత బండ్ల గణేష్ కలిశాడు. సింగిల్ సిట్టింగ్ లోనే క్లోజ్ అయిపోయారు. కానీ బ్యాడ్ లక్ రవితేజ చాలా ప్రాజెక్టులు ఒప్పేసుకుని ఉన్నాడు. ఒకటి శంభో శివ శంభో, మరొకటి కృష్ణవంశీ డైరెక్షన్ లో కందిరీగ, ఈ సమయంలో హరీష్‌కు ఏం అర్థం కాలేదు. ఫ్లాప్ వచ్చింది కాబట్టి ఇవి కామనే అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత బండ్ల గణేష్ నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా నందగిరి హిల్స్ కు రా.. అని అన్నాడు. నందగిరి హిల్స్ అంటే అక్కడ పవన్ కళ్యాణ్ అంటాడు. హరీష్ శంకర్ కి అస్సలు అర్థం కాలేదు. వెంటనే కళ్యాణ్ ఇంటి ముందు వాలిపోయాడు. బయట వెయిట్ చేస్తున్న సమయంలో కాసేపటికి గేటు తెరుచుకుని లోపలికి నుంచి మూడు కార్లు బయటకు వెళుతున్నాయి. హరీష్ అయోమయంగా వాటి వంకే చూస్తున్నాడు. గణేష్ కి కాల్ చేస్తే నేను కళ్యాణ్ బాబు తోనే ఉన్నాను. ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం. నువ్వు కూడా నా కారులో అక్కడికి వచ్చాయి. అదిరిపోయే కథ చెప్పాలి. అని ఫోన్ పెట్టేసాడు. ఆ తర్వాత హరీష్ కారులో కూర్చున్నాడు అన్న మాటే గానీ చాలా టెన్షన్ పడుతున్నాడు. పవన్ కి ఏ కథ చెప్పాలి. ఎలా చెప్పాలి. అలా సగం దూరం వెళ్ళాక మళ్లీ గణేష్ నుంచి ఫోన్, నీ దగ్గర లవ్ స్టోరీ ఉందా.. ఇప్పటికిప్పుడు లవ్ స్టోరీయా ఎలా.. అనుకున్నాడు. రవితేజ కోసం చేసిన స్టోరీలు అని చెబుదామా అనుకున్నాడు.. అప్పటికప్పుడు టైటిల్ కూడా వేసుకున్నాడు. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫార్మ్ హౌస్ కి వెళ్లారు. కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఐదు నిమిషాలు పదినిమిషాలు పావుగంట కథ నడుస్తూనే ఉంది. ఆయన కథ చెబుతున్న అంతసేపు చాలా నవ్వారు పవన్ కళ్యాణ్. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత పవన్ కళ్యాణ్ కి కాల్ చేసాడు. అక్కడ ఫోటో సెషన్ జరుగుతోంది. పవన్ పోలీస్ గెటప్ లో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ హిందీ సినిమా దబాంగ్ ను తెలుగులో చేస్తున్నాం. సినిమా పేరు గబ్బర్ సింగ్. డైరెక్టర్ నువ్వే అని చెప్పారు కళ్యాణ్. ఈ విధంగా సినిమా మొదలైంది. అప్పుడే సినిమా గురించి వార్తల్లోకెక్కింది. సినిమా టీజర్ కోసం ఒక మంచి వీడియో కావాలి అన్నారు. దీంతో హరీష్ ఎక్సటెంషన్ పడుతూనే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి నాక్కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అనే డైలాగు చెప్పారు. దీంతో పవన్ కళ్యాణ్ చాలా నవ్వుతూ, తన అమ్మ, వదిన అందరికి ఫోన్ చేసి చెప్పారు.ఈ విధంగా సినిమా పూర్తయింది బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. ఇది హరీష్ శంకర్ జీవితాన్నే మార్చేసింది అని చెప్పవచ్చు.
Advertisement
ALSO READ;
Advertisement
త్రివిక్రమ్, పూరి బ్రతిమిలాడినా ‘దేశముదురు’ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే…?
ఆ హీరోను పెళ్లికి ఎందుకు పిలిచావ్ …నయనతార పై నెటిజన్ల ఫైర్ ….!