సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ నయనతార. నయనతార రీసెంట్ గా ఈ నెల 9న దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా నయనతార విగ్నేష్ ప్రేమించుకుంటున్నారు. చాలాకాలం పాటు వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. డేటింగ్ లో ఉన్న సమయంలో వీరిద్దరూ తరచూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం వల్ల వీరి రిలేషన్ షిప్ బయటపడింది. దాంతో అభిమానులు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ ఇద్దరి ఫోటోలకు కామెంట్ల వర్షం కురిపించారు.
Advertisement
ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ జంట వివాహం చేసుకుని ఒకటైంది. వీరి వివాహం మహాబలేశ్వరం లోని ఓ పెద్ద రిసార్ట్స్ లో గ్రాండ్ గా జరిగింది. వీరి వివాహానికి పలువురు బంధువులు, రాజకీయప్రముఖులు సహా సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ వివాహానికి నటుడు దిలీప్ కుమార్ హాజరవ్వడం పై మలయాళ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
దిలీప్ కుమార్ తెలుగు వాళ్లకు పెద్దగా పరిచయం లేదు కానీ మలయాళ ప్రేక్షకులకు సుపరిచితుడే. దిలీప్ కుమార్ నటి భావన పై లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతం లో దిలీప్ కుమార్ ఓ నటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని భావన అతడి భర్తకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లోనే దిలీప్ కుమార్ తన సోదరుడితో కలిసి భావన పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఆరోపణలు ఉన్నాయి.
అప్పట్లో ఈ వార్త కేరళలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే నయనతారను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. అలాంటివాడ్ని నీ పెళ్లికి ఎందుకు ఆహ్వానించావు…. అంటూ నయన్ పై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే పెళ్లంటే ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. అందరిని ఆహ్వానించినట్టే నయనతార దిలీప్ కుమార్ ను కూడా ఆహ్వానించింది.. అందులో తప్పేముంది అంటూ నయన్ అభిమానులు వాదిస్తున్నారు.
Also read : గబ్బర్ సింగ్ లో నటించినందుకు అప్పు ఎందుకు సినిమాలను మానివేయాల్సి వచ్చిందట .! ఎందుకంటే ?