Home » డ్యాన్స్ తో వైరల్ అవుతున్న మరో పెళ్లి కూతురు..!

డ్యాన్స్ తో వైరల్ అవుతున్న మరో పెళ్లి కూతురు..!

by Azhar
Ad

ఈ మధ్య కాలంలో పెళ్లి అంటే ఓ పండుగ అనే చెప్పాలి. అందుకోసమే జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎవరు వెనుకాడటం లేదు. ఎంత ఖర్చు చేసిన అయిన సరే… పెళ్లి మాత్రం గ్రాండ్ గా ఉండాలి అని అనుకుంటున్నారు. అయితే ఈ మధ్య పెళ్ళిలో పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడం అనేది ఓ ట్రెండ్ గా నడుస్తుంది. ప్రతి పెళ్ళిలో పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కానీ అందులో కొన్ని వెంటనే వైరల్ అవుతుంటాయి. అలంటి వీడియో మనం ఈ మధ్యే చూసాం.

Advertisement

తెలుగులో పోపులర్ అయిన బుల్లెట్ బండి సాంగ్ కు ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఆమెను ఓ సెలబ్రెటీనే చేసింది. అప్పుడు ఏకంగా న్యూస్ ఛానెల్స్ కూడా ఆ పెళ్లి కూతురు ఇంటర్వ్యూ అనేది తీసుకుంది. ఇప్పుడు కూడా అటువంటి ఘటనే ఒక్కటి జరుగుతుంది. కానీ ఇది వెంటనే ట్రెండ్ అవుతున్న డ్యాన్స్ కాదు. వైరల్ అవుతున్న వార్త. అంటే ఏడాది కిందట ఆ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ అనేది ఇపుడు తెగ వైరల్ అవుతుంది.

Advertisement

కేరళకు చెందిన అఖిల అజిత్ అనే అమ్మాయి ఏడాది కిందట తన పెళ్ళిలో చేసిన డ్యాన్స్ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. కానీ అప్పుడు సైలెంట్ గా ఉన్న ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అందుకు కారణం ఆమె చేసిన డ్యాన్స్ స్టెప్స్ అనే చెప్పాలి. ఓ పక్క డ్యాన్సార్ మాదిరిగా ఆ పెళ్లి కూతురు స్టెప్స్ వేసింది. దానికి ఇప్పుడు ప్రజలను ఫిదా అవుతున్నారు. దాంతో వైరల్ గా మారిన ఆ వీడియో 21 మిలియన్స్ వ్యూస్ ను సంపాదించుకొని.. ఇప్పటికి పోతూనే ఉంది.

ఇవి కూడా చదవండి :

మద్యం మత్తులో రోడ్డు మీద చాహల్, నెహ్రా రచ్చ..!

సిరాజ్ వల్లనే గొడవ అంటున్న రియాన్ పరాగ్…!

Visitors Are Also Reading