హీరోయిన్ ఇంద్రజ అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారుండరు. ఆమె చెన్నైలో స్థిరపడినప్పటికీ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన నటి. కానీ ఆమె తెలుగులో కన్నా బాలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఎక్కువ సినిమాలు చేశారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన విషయంలో ఈ కథ ఇంద్రజకు సరిపోతుంది అనుకొని వచ్చిన వారి దగ్గర నేను నటిస్తున్నాను. కథల విషయానికి వస్తే నాకు నచ్చితేనే చేస్తాను. నాకు కథలు నచ్చక చాలా సినిమాలు వదులుకున్నాను. అక్క, వదిన, భార్య ఇలా ఏ క్యారెక్టర్ చేయడానికైనా నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఏ క్యారెక్టర్ చేసిన సినిమాలో నేరుగా అంతర్లీనంగా ఒక మెసేజ్ వుండాలని భావిస్తున్నాను. అలాంటి పాత్రలు వస్తే నేను చేస్తాను. చెన్నైలో స్థిరపడ్డాను కాబట్టి ఎక్కువగా అక్కడి సినిమాల్లో మాత్రమే నటించాను. అవుట్ డోర్ షూటింగ్ అయితే చాలా తక్కువగా ఒప్పుకుంటానని తెలిపింది. శతమానంభవతి మూవీకి దాదాపు పదిహేను రోజులు రాజమండ్రిలోనే ఉండవలసి వచ్చింది. మా పాపను మా హస్బెండ్ ను మా ఫాదర్ చూసుకున్నారు. నేను తెలుగు బ్రాహ్మిన్. ఇప్పటికి కూడా నేను అలాగే ఉన్నాను. కానీ మా ఆయన ముస్లిం. అయినా పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే మనసు మాత్రమే. అదే మా ఇద్దరినీ దగ్గర చేసింది. మతం చూసి, కులం చూసి పెళ్లి చేసుకోవడం అనేది సినిమాల్లో డైలాగ్ లా ఉంటుంది. మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ ఉండేవారు. మేము ఫ్రెండ్స్ గా 6 ఇయర్స్ నుంచి కలిసి ఉన్నాం. అలా ఒకరినొకరు అర్థం చేసుకుని, ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నామన్నారు. ఆయన రైటర్, ఆడ్ ఫిలిం మేకర్, కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. ఇవే కాకుండా మాకు ఫామిలీ బిజినెస్ లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది నటి ఇంద్రజ.
Advertisement
ALSO READ;
Advertisement
నాగార్జున బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నారా..? దాని వెనుక ఉన్న అసలు వివాదం ఇదేనా..?
“విక్రమ్” సినిమాలో “టీనా” ఎవరు..? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?