పెళ్లికి ముందు…పెళ్లైన కొద్దిరోజుల వరకూ భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు ఏ విధంగా ఉంటాయో తెలిసిందే. ఒకరిని ఒకరు విడిచి బ్రతకలేము అన్నంతగా వారు ప్రేమించుకుంటారు. కన్న బుజ్జి నాన అంటూ ముద్దు పేర్లు పెట్టుకుని పిలుచుకుంటారు. వీధిలో కలిసి నడిచినా ఇద్దరూ చేతులు పట్టుకుని మరీ నడుస్తారు. ఫ్యామిలీ ఫంక్షన్ లకు వెళ్లారంటే ఒకరి పక్కన మరొకరు ఉంటారు. అంతే కాదు ఒక గంట కనిపించకపోతే తమ భార్య ఎక్కడ ఉందని భర్తలు….తన భర్త ఎక్కడ ఉందని భార్యలు వెతకడం మొదలుపెడతారు.
Advertisement
అయితే పెళ్లయ్యాక ఒక యేడాది తరవాత మాత్రం కొన్ని జంటల్లో ఈ ప్రేమానురాగాలు కనిపించవు. సీన్ రివర్స్ అవుతుంది. భార్యలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా భర్తలు ఫోన్ లిఫ్ట్ చేయరు. భర్తలు ఏదైనా వండిపెట్టమన్నా భార్యలు కసురుకుంటారు. ఇలా ఒకటేంటి అన్ని విషయాల్లోనూ మార్పులు వస్తాయి. అయితే పెళ్లైన తరవాత భార్య భర్తల బంధంలో ఇలాంటి మార్పులు రావడానికి ఒక ఐదు కారణాలు ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Advertisement
పెళ్లైన కొత్తలో ఒకరిపై మరొకరికి ఎక్కువ అంచనాలు ఉంటాయి. దాంతో ఒకరినొకరు ఇంప్రెస్ చేయాలని ఆరాటపడుతుంటారు. అయితే పిల్లలు పుట్టిన తరవాత ఇద్దరూ పిల్లలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఒకరితో మరొకరికి ప్రాధాన్యత తగ్గుతుందట. అంతే కాదు ముందు ఒకరి గురించి మరొకరికి తెలియదు కాబట్టి వాళ్ల గురించి పూర్తిగా తెలుసకున్న తరవాత కూడా వాళ్ల లక్షణాలను బట్టి దూరం పెరిగే అవకాశం ఉంటుందట.
అంతే కాదు పెళ్లికి ముందు వాళ్ల అందం చూసి మాత్రమే ఇష్టపడితే పెళ్లైన తరవాత వ్యామోహం తగ్గిపోయి లైట్ తీసుకుంటారట. అలా కూడా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. పెళ్లి తరవత ఒకరికొకరు ఎంతో గౌరవం ఇచ్చుకుంటారు. కొన్ని రోజుల తరవాత అదే గౌరవం కనిపించకపోతే కూడా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందట.
AlSO READ : రామ్ గోపాల్ వర్మ తన కూతురిని చూడకుండా 7 సంవస్సరాలు దూరంగా ఉన్నారట.. ఎందకంటే…?