1996లో ఇండియా మొత్తంలో భారీ హిట్ అయిన భారతీయుడు. ఈ సినిమా తర్వాత సౌత్ లో డైరెక్టర్ శంకర్ ఇండియాలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు పొందారు. ఆయన నెక్స్ట్ మూవీ చేస్తే అంతకుమించి ఉండాలి కానీ తగ్గకూడదని ఫిక్స్ అయిపోయారు. మరో భారీ చిత్రానికి ప్లాన్ చేసారు శంకర్.
Advertisement
రజినీకాంత్ ను గానీ, ఆయన ఒప్పుకోకపోతే విజయ్ కాంత్ ను గానీ హీరోగా అనుకున్నారు. ఈ సందర్భంలోనే ప్రేమికుడి టైపులో ఒక మీడియం రేంజ్ సినిమా చేద్దామని అనుకున్నారు. తన టీం అందరితో కూర్చొని కాన్సెప్టుతో సింపుల్ స్టైల్ స్క్రీన్ ప్లేతో స్క్రిప్ట్ తయారు చేశారు. ముందుగానే బడ్జెట్ 10 కోట్లకు పైగా అవుతుందని ఒక అంచనాకు వచ్చారు.
10 కోట్ల అంటే అందరికీ భారీ బడ్జెట్ మూవీ. కానీ శంకర్ దృష్టిలో అది మీడియం బడ్జెట్ మూవీ. అప్పటివరకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న అశోక్ అమృతారావు, ఈ సినిమాకు నిర్మాత. అయితే శంకర్ సాంగ్స్ అండ్ గ్రాఫిక్స్ కోసం ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పడంతో మరో ఇద్దరు నిర్మాతలు ఆడ్ అయ్యారు. వీరంతా కొత్త నిర్మాతలు కావడం మరో విశేషం. ఇప్పుడు బడ్జెట్ 15 కోట్లు. సినిమా పేరు జీన్స్. అటు మోడ్రన్ గా ఇటు కథకు తగ్గట్టు సంగీతపరంగా టైటిల్ సెట్ అవుతుంది. జస్ట్ ఆ టైటిలే అందరినీ అప్పట్లో మాట్లాడుకునేలా చేసింది ఈ మూవీ. ఇక కాస్టింగ్ మొదలైంది. ముందు హీరోగా అబ్బాస్ ను సంప్రదించారు.
Advertisement
ప్రేమదేశం సినిమా దెబ్బకి తన ఇమేజ్ ఎంతో పెరిగిపోయింది. మూడు సంవత్సరాల పాటు డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి. తర్వాత అజిత్ ని అడిగారు. తాను కూడా డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో ప్రశాంత్ ను సంప్రదించారు శంకర్. ప్రేమికుడు మూవీకి ఫస్ట్ ఆప్షన్ ప్రశాంత్. ఆ మూవీని వదులుకున్నందుకు పశ్చాత్తాప పడుతున్న ప్రశాంత్ వెంటనే జీన్స్ మూవీ ఒప్పోసు కున్నారు. అప్పటికి కమిట్ అయిన సినిమాలు అన్నీ ఈ సినిమా కోసం క్యాన్సిల్ చేసుకున్నాడు ప్రశాంత్. హీరోయిన్ ఐశ్వర్య రాయి. భారతీయుడు మూవీని వదులుకున్నందుకు తాను బాధ పడింది. ఈ విధంగా సినిమా 18 కోట్లు పెడితే టోటల్ గా 35 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
also read;
ఫ్లాప్స్ లో ఉన్న దర్శకులకి ఎన్టీఆర్ ఇచ్చిన 5 సూపర్ హిట్ సినిమాలు ఇవేనా..?