సాధారణంగా డీఎన్ఏ పరీక్ష మానవులకు చేయించడం మనం చూస్తుంటాం. ఓ బర్రెకి, ఓ పిల్ల దున్నపోతుకు పోలీసులు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నారు పోలీసులు. దాని అసలు యజమాని ఎవరు..? తెలుసుకునేందుకు బర్రెకి దున్నపోతుకి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నారు. బర్రెకు డీఎన్ఏ టెస్ట్ ఎందుకు అబ్బా అని ఆలోచిస్తున్నారో.. కొన్ని సందర్భాల్లో మనుషులతో పాటు జంతువులకు ఇలాంటి పరీక్షలు తప్పవు.
ఉత్తర ప్రదేశ్ లోని షామిల్ జిల్లాలోని అహ్మద్‌ఘర్ గ్రామంలో నివసించే చంద్రపాల్ కశ్యప్ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2020 ఆగస్టు 25 తన కౌషెడ్ నుంచి మూడేళ్ల వయస్సు ఉన్న దున్నపోతుని ఎవరో దొంగిలించారని.. అదే ఏడాది నవంబర్‌లో షారాన్ పూర్ జిల్లాలోని బీన్పూర్ గ్రామంలో ఆ దున్నపోతుని తాము గుర్తించామని దున్నపోతు తమదేనని సత్బీర్‌సింగ్ అనే వ్యక్తి వాదిస్తూ దానిని తమకు ఇవ్వడం లేదని చంద్రపాల్ కశ్యప్ పోలీసులకు పిర్యాదు చేసాడు.ఈ ఫిర్యాదు ఆ తరువాత కరోనా రావడంతో కేసు పక్కకు పోయింది. ఇప్పుడు ఆ దున్నపోతు అసలు యజమాని ఎవరో గుర్తించేందుకు షామిల్ ఎస్పీ సుకృతి మాధవ్.. కశ్యప్ దగ్గర ఉన్నట్టు చెప్పబడుతున్న తల్లి బర్రెకు షారాన్ పూపర్‌లో సత్పీర్ సింగ్ దగ్గర ఉన్న పిల్ల దున్నపోతుకు డీఎన్ఏ టెస్ట్ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు.
Advertisement
Advertisement
షామిల్ ఎస్పీ సుకృతి మాధవ్ మాట్లాడారు. ఆ దున్నపోతు అసలు యజమాని ఎవరో తెలుసుకోవడం కూడా వాస్తవానికి సవాలుగానే మారింది. తన వద్ద దూడ తల్లి ఉందని కశ్యప్ పేర్కొన్నందున మేము డీఎన్ఏ పరీక్ష చేయించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తన దూడను ఎలా గుర్తించాడో కశ్యప్ వివరిస్తూ.. మానవుల వలే జంతువులు కూడా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. ఆ దున్నపోతు ఎడమకాలు మీద మచ్చ ఉంది. తోక చివర తెల్లని పాచ్ కూడా ఉన్నది. మూడవది జ్ఞాపక శక్తి. నేను దగ్గరకు వెల్లినప్పుడు అది నన్ను గుర్తించి నన్ను చేరుకోవడానికి ప్రయత్నించింది. దాని ఐడెంటిటిని బయటపెట్టేందుకు ఇంతకు మించిన నేను ఏమి చేయాలని ప్రశ్నించారు.
Also Read :
ss రాజమౌళి విరాళాలు అస్సలు ఇవ్వరట ఎందకో తెలుసా ? ఒక ప్రత్యేకమైన కారణం ఉంది ..!