Home » మెగాస్టార్ అల్లుడి ప‌రిస్థితి ఇలా అయ్యిందేంటి..?

మెగాస్టార్ అల్లుడి ప‌రిస్థితి ఇలా అయ్యిందేంటి..?

by AJAY
Published: Last Updated on
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో మెగా హీరోల‌కు ఓ క్రేజ్ ఉంటుంది. మెగాఫ్యామిలీ నుండి వ‌చ్చాడంటే థియేట‌ర్ లు ప‌క్కా దొరుకుతాయి. ద‌ర్శ‌కులు సినిమాలు చేసేందుకు క్యూ క‌డ‌తారు. నిర్మాత‌లు కూడా మెగాహీరోల‌కు ప‌క్కాగా మార్కెట్ ఉంటుందని న‌మ్మకం పెట్టుకుంటారు. కానీ మెగాస్టార్ అల్లుడు క‌ల్యాణ్ దేవ్ ప‌రిస్థితి మాత్రం అలా లేదు. క‌ల్యాణ్ దేవ్ మొద‌ట న‌టించిన సినిమాల‌కు మెగాస‌పోర్ట్ అందిన‌ట్టు క‌నిపించింది.

Advertisement

 

కానీ ఇప్ప‌డు క‌ల్యాన్ దేవ్ సినిమాలు వ‌స్తున్నాయి పోతున్నాయి వాటిని ప‌ట్టించుకునే నాధుడు మాత్రం లేడు. ఇటీవ‌ల క‌ల్యాణ్ దేవ్ హీరో వ‌చ్చిన ఓ సినిమా థియేట‌ర్ లో బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు క‌ల్యాణ్ దేవ్ కిన్న‌ర‌సాని అనే మ‌రో సినిమాలో న‌టించాడు. ఈ సినిమాకు ర‌మ‌ణ‌తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. థ్రిల్ల‌ర్ గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముంద‌కు రాబోతుంద‌ని ద‌ర్శ‌కుడు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.

Advertisement

కానీ ఈ సినిమా థియేట‌ర్ లో కాకుండా ఓటిటిలో విడ‌దల అవుతోంది. జూన్ 10న జీ5 ఓటీటీలో కిన్నెర‌సాని ప్ర‌సారం కానుంది. ఇదిలా ఉంటే నేరుగా ఓటిటిలో క‌ల్యాణ్ దేవ్ సినిమా సినిమా విడుద‌ల అవ్వ‌డం పై నెటిజ‌న్లు ప‌లుర‌కాల అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. కల్యాణ్ దేవ్ శ్రీజ‌తో విడిపోయార‌ని అందువ‌ల్లే మెగాఫ్యామిలీ క‌ల్యాణ్ దేవ్ ను ప‌క్కన పెట్టేసార‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ALso Read: మెగా అభిమానుల‌కు శుభ‌వార్త.. త్రివిక్ర‌మ్‌తో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌..?

Visitors Are Also Reading