Telugu News » Blog » మెగా అభిమానుల‌కు శుభ‌వార్త.. త్రివిక్ర‌మ్‌తో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌..?

మెగా అభిమానుల‌కు శుభ‌వార్త.. త్రివిక్ర‌మ్‌తో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్న‌ల్‌..?

by Anji
Ads

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రి ఇచ్చిన త‌రువాత వ‌రుస సినిమాల‌తో దూస‌కెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవ‌ల చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన రీసెంట్ మూవీ ఆచార్య ఎన్నో అంచ‌నాల మ‌ధ్య కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన‌ప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ చిత్రంలో క‌థ‌, క‌థ‌నం, గ్రాఫిక్స్ ఏమాత్రం ఆడియ‌న్స్‌ను ఆకట్టుకోలేక‌పోయాయి. అన్ని విధాలుగా ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో ఇక అప్‌క‌మింగ్ సినిమాల‌పై మెగాస్టార్ చిరంజీవి చాలా జాగ్ర‌త్త తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

Ads


ఈ త‌రుణంలోనే చిరు సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒక‌టి వైర‌ల్ అవుతోంది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. వ‌రుస‌గా సీరియ‌స్ రోల్స్ చేస్తున్న చిరు.. కాస్త ఛేంజ్ ఓవ‌ర్ కోసం త్రివిక్ర‌మ్‌తో పుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ చేద్దామ‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. గ‌తంలో చిరంజీవి న‌టించిన జై చిరంజీవ సినిమాకు త్రివిక్ర‌మ్ డైలాగ్స్ రాశాడు. ఆ సినిమాలో చిరు చెప్పిన పంచ్ డైలాగ్స్‌కు అభిమానుల నుంచి మంచి స్పందనే వ‌చ్చింది.

Ads


ఇక ఆ త‌రువాత చిరంజీవి-త్రివిక్ర‌మ్ కాంబోలో అభిమానులు ఎంత‌గానో ఎదురు చూసినా సెట్ అవ్వ‌లేదు. గ‌తంలోనే మెగాస్టార్‌తో త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్ ఉంటుంద‌ని వార్త‌లు వినిపించినా ఆ త‌రువాత ప‌ట్టాలెక్క‌లేదు. త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నారు. ఇటు చిరంజీవి హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ చిత్ర‌మును ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రానికి వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రానుండ‌గా.. వాల్తేరు వీర‌య్య టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ద‌ని ఇటీవ‌లే ప్రచారం కొన‌సాగింది. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో గాడ్ ఫాద‌ర్, మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళా శంక‌ర్ సినిమాల్లో చిరంజీవి న‌టిస్తున్నారు. ఇక మెగాస్టార్‌-త్రివిక్ర‌మ్ కాంబోలో సినిమా ఆఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేస్తే ఇక అభిమానుల‌కు పండుగే అని చెప్ప‌వ‌చ్చు.

Also Read : 

ముంబై పేలుళ్లలో ఎందరో జవానులు చనిపోయిన సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ మాత్రమే ఎందుకు తీశారో తెలుసా ?

Ad

నటుడు చంద్రమోహన్ సినీ జీవితం లో మీకు తెలియని విషయాలు..! అతనితో నటించిన హీరోయిన్స్ అందరూ..!