ప్రేమకు చిహ్నంగా పేర్కొంటారు. ప్రపంచంలోనే ఏడు వింతల్లో అది ఒకటి. భారతదేశంలోని టూరిస్టులను ఎంతగానో ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తాజ్‌మహల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ కట్టడం దాదాపు 22 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారు. దాదాపు 20వేల మంది కార్మికులు తాజ్‌మహల్ నిర్మాణం కోసం పని చేసారు.
తాజ్‌మహల్‌ను షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థంగా నిర్మించాడు. ఆగ్రాలో ఉన్న ఈ తాజ్ మహల్ అందాన్ని వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు తరలివస్తుంటారు. తాజ్‌మహల్‌పై రాత్రిపూట విద్యుత్ దీపాలు అసలుండవు. ఇలా ఎందుకు ఉండవో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? సైంటిఫిక్ రీజన్ ప్రకారం.. తాజ్‌మహల్‌ను మార్బుల్‌తో నిర్మించడంతో రాత్రిపూట విద్యుత్ లైట్లు వేస్తే మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. కానీ చరిత్రకారులు తాజ్‌మహల్ కట్టడంపై అప్పుడు ఎలాంటి లైట్లను ఏర్పాటు చేయకపోవడం విశేషం.
Advertisement
Advertisement
తాజ్‌మహల్ పై విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయకపోవడానికి కూడా బలమైన కారణమే ఉంది. తాజ్‌మహల్ యమున నది తీరంలో ఉంటుంది. ఒకవేళ లైట్ల ఏర్పాటు చేస్తే.. ఎక్కువ కాంతి వస్తుంది. పురుగులు వచ్చే అవకాశముంది. దీంతో పురుగులు, దోమలు విసర్జించే పదార్థాలతో తాజ్‌మహల్‌తో పాటు తాజ్ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతాయి. ఇక తాజ్‌మహల్ మార్బుల్ కూడా దెబ్బతినే అవకాశముంది. అందుకే అందమైన తాజ్‌మహల్‌ను విద్యుత్ లైట్ల వెలుగు కంటే చందమామ కాంతిలో చూస్తే మరింత అందంగా కనిపిస్తుంది. ఈ కారణాల మూలంగానే తాజ్‌మహల్‌పై దీపాలు ఏర్పాటు చేయలేదని స్పష్టమవుతోంది.
Also Read :
Telugu lo KK padina songs : మీ ఫెవరేట్ సాంగ్స్‌లో ఒక్కటైనా కేకే సాంగ్ ఉంది ఉంటుంది
పీకే అంటే కొత్త అర్ధం చెప్పిన పూనమ్ కౌర్…!